»   » అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

అఖిల్ పెళ్లి కేన్సిల్ ఇష్యూ.... అవకాశం కూడా ఇవ్వని అమల అక్కినేని!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: టాలీవుడ్లో ఇపుడు మోస్ట్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే... అది అఖిల్ అక్కినేని పెళ్లి రద్దు అంశమే. ప్రముఖ వ్యాపారవేత్త జీవికె రెడ్డి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమాయణం, చిన్న వయసులోనే పెళ్లిపై నిర్ణయం తీసుకోవడం.... ఓ సంచలనం. నిశ్చితార్థం కూడా పూర్తయి మరికొన్ని రోజుల్లో పెళ్లి వేడుక జరుగుతుంది అనే సమయంలో వీరిద్దరు పెళ్లి రద్దు చేసుకున్నారనే వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాయి.

  ఈ విషయమై జాతీయ మీడియా దగ్గర నుండి లోకల్ వెబ్ సైట్ల వరకు రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఇటు అక్కినేని ఫ్యామిలీగానీ, అటు జీవికె రెడ్డి ఫ్యామిలీ గానీ స్పందించడం లేదు.

  అఖిల్, శ్రీయ ఎందుకు విడిపోయారు... పెళ్లి రద్దవ్వడంలో అసలు కారణం ఏమిటి? అనేది వారి సన్నిహితులు, ఫ్రెండ్స్ కు కూడా అంతుపట్టడం లేదట. ఈ విషయం మీడియాలో వైరల్ అయినప్పటి నుండి అక్కినేని ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అంతా మీడియాకు వీలైనంత దూరంగా ఉంటున్నారు.

   అమల అక్కినేని

  అమల అక్కినేని

  అఖిల్ తల్లి అమల అక్కినేని ఆదివారం హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇన్ ఆర్బిట్ మాల్ లో ఓ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభించడంతో పాటు, మాదాపూర్ లో ఓ సెలూన్, స్పాను ప్రారంభించారు.

   అవకాశం కూడా ఇవ్వలేదు

  అవకాశం కూడా ఇవ్వలేదు

  ఈ సందర్భంగా కొందరు మీడియా వారు ఆమెను అఖిల్ విషయమై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. ఇలాంటివి ఎదురవుతాయని ముందే ఊహించిన అమల వారికి ఆ అవకాశం కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు.

   ఆ గొడవే కారణమా?

  ఆ గొడవే కారణమా?

  అఖిల్‌, శ్రీయల మధ్య హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. రోమ్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు అఖిల్‌, శ్రీయ, ఆమె తల్లి బయల్దేరారట. అయితే ఎయిర్‌పోర్ట్‌లోనే అఖిల్‌, శ్రీయల మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వినిపిస్తున్నాయి.

   అందరూ చూస్తుండగా గొడవ?

  అందరూ చూస్తుండగా గొడవ?

  ఎయిర్ పోర్టులో అందరూ చూస్తుండగా బహిరంగంగా వాదనకు దిగారని టాక్. వాదన అనంతరం శ్రీయను, ఆమె తల్లిని అక్కడే వదిలేసి, గుడ్‌బై చెప్పేసి అఖిల్‌ ఇంటికి వెళ్లిపోయాడట. వారిద్దరూ అఖిల్‌ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. ఆ తర్వాత అఖిల్‌ను, శ్రీయను కలిపేందుకు నాగ్‌ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసిది లేక నాగ్‌ సైలెంట్‌ అయిపోయాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

   అఖిల్ డిప్రెషన్

  అఖిల్ డిప్రెషన్

  అఖిల్ సైతం ఊహించని ఈ సంఘటనపై చాలా బాధగా ఉన్నారని, ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని, బాగా సన్నిహితులు అనుకున్న స్నేహితులతో సైతం ఈ విషయం చర్చించటానికి ఇష్టపడటం లేదని సమాచారం. ముఖ్యంగా ఈ విషయమై రెండు కుటుంబాలలోని అధికారికంగా మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. మీడియావారు ఈ విషయమై స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించినా అది సాద్యం కావటం లేదు. ఆంతరంగికంగా మాత్రం వివాహం రద్దు విషయాన్ని ఇరు కుటుంబాలూ తెలియజేస్తున్నాయట.

   నాగార్జున ప్రయత్నం ఫలించలేదు

  నాగార్జున ప్రయత్నం ఫలించలేదు

  ఈ విషయమై నాగార్జున చాలా ఫీలయ్యారని, వెంటనే తన పనులన్ని ప్రక్కన పెట్టిన ఆయన ...తమ రెండు కుటుంబాల పెద్దలు, అఖిల్, శ్రియ కూర్చొని మాట్లాడుకుని, సమస్యను పరిష్కరించుకుందామని అటు వైపు వారికి నాగార్జున సూచించారని తెలుస్తోంది. అయితే ..., అటు నుంచి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు.

   త్వరలోనే బయటకు

  త్వరలోనే బయటకు

  త్వరలో అఖిల్, శ్రీయ బ్రేకప్ కు సంబంధంచిన అసలు విషయాలు బయటకు రానున్నాయి. అప్పటి వరకు మనం కాస్త ఓపిక పట్టాల్సిందే.

  English summary
  Inorbit mall today rolled the curtains and laid the carpet for the grand opening of Inorbit Galleria - “WILD WORLD” – the first ever art gallery in a mall in Hyderabad. The art gallery was inaugurated by Eminent actress and Social Activist Amala Akkineni. The renowned actress, who is wife of actor Nagarjuna, launched the gallery by lighting the lamp ceremony. She also interacting with the some of the artists and browsed through their paintings. Also, present at the event was, well-known artist, Dr Somburu Sovara.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more