»   »  నిహారిక ఏం చేసిందో తెలుసా? మెగా వారసుల కంటే ఫాస్ట్‌గా ఉందే!

నిహారిక ఏం చేసిందో తెలుసా? మెగా వారసుల కంటే ఫాస్ట్‌గా ఉందే!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మెగా డాటర్ కొణిదెల నిహారిక చిరంజీవి ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన తొలి హీరోయిన్ గా రికార్డుల కెక్కింది. భారీ హైప్, ఊహించని క్రేజ్‌తో ఆమె నటించిన తొలి చిత్రం 'ఒక మనసు' గతేడాది విడుదలైంది. అయితే హారికకు తొలి ప్రయత్నంలో నిరాశే ఎదురైంది.

ఆ సినిమా ఫలితంతో ఆలోచనలో పడిన నిహారిక ఆ తర్వాత ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో చాలా పరిమితులకు లోబడి ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చు. ఇక్కడే ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదనుకున్న నిహారిక వెంటనే తన దృష్టి తమిళ ఇండస్ట్రీ వైపుకు మళ్లించింది. గతంలో ఏ మెగా హీరో కూడా తమిళ సినిమా వైపు ఇంత వేగంగా మూవ్ కాలేదు.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం... తమిళహీరో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలకు నిహారిక సైన్ చేసినట్లు సమాచారం. చాలా కాలంగా ఈ సినిమా కోసం నిహారికను సంప్రదిస్తున్నారు. ఇటీవలే అగ్రిమెంట్ పూర్తయి షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

 నిహారిక

నిహారిక

ఈ తమిళ సినిమా ద్వారా అనురాగ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాలో తన రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో నిహారిక ఒప్పుకుందని, ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మణితర్నం కడలి చిత్రంలో హీరోగా చేసిన గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 నాపై ప్రేమ కాదు, డబ్బు కోసమే చరణ్ అలా చేసాడంటూ... నిహారికతో చిరంజీవి

నాపై ప్రేమ కాదు, డబ్బు కోసమే చరణ్ అలా చేసాడంటూ... నిహారికతో చిరంజీవి

నా పిట్ నెస్ విషయంలో వీరు తీసుకుంటున్న కేర్ చూసి నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ, ప్రేమ కాదు... డబ్బు కోసమే చరణ్ అలా చేసాడంటూ చిరంజీవి ఇటీవల నిహారిక ఇంటర్వ్యూలో కామెంట్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

తమ్ముడికి నేనవసరం లేదు, వాడిది భయంకరమైన క్యారెక్టర్ అంటూ మెగాబ్రదర్ నాగబాబు... పవన్ కళ్యాణ్ గురించి పలు ఆశ్చర్యకర, సంచలన విషయాలు బయట పెట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 వాలంటైన్స్ డే రోజు.... చిరంజీవి సెల్ఫీ చూసారా (ఫోటోస్)

వాలంటైన్స్ డే రోజు.... చిరంజీవి సెల్ఫీ చూసారా (ఫోటోస్)

చిరంజీవి హోస్ట్ చేస్తున్న ఈషోలో ఇకపై ప్రముఖ స్టార్స్ అందరూ సందడి చేయబోతున్నారు. చాలా మంది ఈ షోలో మెగాస్టార్ తో కలిసి పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar source said that, Niharika has been signed to play the female lead in actor Vijay Sethupathi’s next. The film will be directed by a debutant Arumuga Kumar, who has known Vijay for a long time. Niharika has got a very interesting role and so decided to give it a go-ahead. She has already begun shooting for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu