»   » డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

డబ్బు కోసమే, హింసించారంటూ... చరణ్‌పై చిరంజీవి షాకింగ్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి రోజు కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన ఈచిత్రం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానుల్లో ఎక్కడ లేని సంతోషాన్ని నింపింది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు వివి వినాయక్ లతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ డిజైన్ చేసారు. ఈ ఇంటర్వ్యూ చేసింది మరెవరో కాదు మెగా డాటర్ నిహారిక.

రోటీన్ గా జరిగే ఇంటర్వ్యూలకు భిన్నంగా ఎంతో ఉత్సాహంగా, ఆసక్తికరంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. ఎవరూ ఊహించని ప్రశ్నలు, చిరంజీవి నుండి ఎవరూ ఊహించని సమాధానాలు ఈ ఇంటర్వ్యూలో హైలెట్ అయ్యాయి.

డాడీ... నీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా

డాడీ... నీ ఫిట్నెస్ మంత్రం ఏంటో చెబితే, నేను కూడా మా నాన్నకు చెప్పి, ఫిట్ చేసుకుంటా

నిహారిక అడిగిన ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ..... ఇందుకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమన్నారు. తన భార్య సురేఖ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. చరణ్ నా కోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను పెట్టి వ్యాయామాలు, బరువు విషయంలో చాలా కేర్ తీసుకున్నారు అని చిరంజీవి తెలిపారు.

నాపై ప్రేమ కాదు, డబ్బు కోసమే చరణ్

నాపై ప్రేమ కాదు, డబ్బు కోసమే చరణ్

నా పిట్ నెస్ విషయంలో వీరు తీసుకుంటున్న కేర్ చూసి నా మీద ఎంత ప్రేముంది అనుకునేవాడిని. కానీ, ప్రేమ కాదు... ఒకరు సినిమా ప్రజెంటర్, ఒకరు సినిమా నిర్మాత. హీరో బాగుంటేనే కదా, నాలుగు డబ్బులు వస్తాయి. తర్వాత నాకు అర్థమైంది డబ్బుపై మమకారంతోనే నన్ను నానా హింసలూ పెట్టారు అంటూ... చిరంజీవి సరదాగా షాకింగ్ కామెంట్స్ చేసారు. చిరంజీవి అలా అనగానే వివి వినాయక్ వెంటనే అందుకుని అలా మీరు అనుకోవద్దు, చరణ్ కు మీపై ఎంతో ప్రేమ. రోజూ నాకు ఫోన్ చేసి మీ బాగోగులు కనుక్కునే వారు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసారు.

మళ్లీ రీ మేక్ చేయాలంటే...

మళ్లీ రీ మేక్ చేయాలంటే...

ఇప్పటి వరకు చేసిన 150 సినిమాల్లో మళ్లీ ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఏది ఎంచుకుంటారు... అనే నిహారిక ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.... ‘ఖైదీ'(పాత మూవీ) మూవీ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

rn

చరణ్ తో రీమేక్ అంటే

చరణ్ తో రిమేక్ చేయాలంటే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఎంపిక చేస్తానని, హీరోయిన్ గా అయితే శ్రీదేవి కూతురు నా మొదటి ఆప్షన్ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే చరణ్ మాత్రం రీమేక్ చేయాలనుకుంటే ‘గ్యాంగ్ లీడర్' చేస్తానని చెప్పుకొచ్చారు.

English summary
Chiranjeevi shocking comments on his son Ram Charan. Check out details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu