twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ఒక భయంకరమైన క్యారెక్టర్: నాగబాబు చెప్పిన సంచలనాలు ఇవే....

    జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు నాగబాబు.... పవన్ కళ్యాణ్ మీద నా దృష్టికోణం పేరుతో చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గురించి ఆయన సోదరుడు నాగబాబు.... పవన్ కళ్యాణ్ మీద నా దృష్టికోణం పేరుతో చాలా విషయాలు చెప్పుకొచ్చారు.

    ఒక వ్యక్తిగా, ఒక బ్రదర్ గా నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన విషయం ఉంది అంటూ పలు పవన్ చిన్న తన నుండి నేటి రాజకీయా విషయాల వరకు పలు సంచలన విషయాలు చెప్పుకొచక్చారు.

    కళ్యాణ్ బాబును చిన్నప్పటి నుండి ఒక అన్నగా నేను గమనించాను. వాడు ఏదైనా కావాలనుకుంటే అది దొరికే దాకా వదిలి పెట్టడు. అంత స్ట్రాండ్ ఆటిట్యూడ్ ఉన్న చైల్డ్. చిన్నతనంలో ఎక్కువ అల్లరి చేసే వాడు కాదు, ఇంట్లోనే ఉండేవాడు.... బయటకు వెళ్లి ఆడుకునే అలవాటు, బాగా అల్లరి అలవాటు ఎప్పుడూ లేదు. మాపై ఎంత ప్రేమ ఉందో ఎప్పుడూ ఎక్స్ ఫోజ్ చేయడు. ఏ ఫీలింగ్స్ అయినా లోపలే ఉంచుకుంటాడు. నేను ఎక్స్‌ప్రెసివ్ పర్సన్, అన్నయ్య చిరంజీవిగగారు కూడా అంతే. కళ్యాణ్ బాబుకు చిన్నప్పటి నుండి అది లేదు, అవసరమైనపుడు తన ఎక్స్ ప్రెషన్ చేతల్లో చూపే రకం అని నాగబాబు తెలిపరాు.

    డిగ్రీ కూడా లేదు

    డిగ్రీ కూడా లేదు

    కళ్యాణ్ బాబు పెద్దగా చదువుకోలేదు, కనీసం డిగ్రీ కూడా లేదు. మేమంతా ఎంఏ, ఎల్.ఎల్.బి చేసాం, బాగా చదివాం. కానీ మాకు ఎవరికీ లేనటువంటి జ్ఞానం వాడికి ఉంది. ముఖ్యంగా రాజకీయ పరిజ్ఞానం బాగా ఉంది. ప్రపంచ, దేశీ అంశాలో చాలా జ్ఞానం. వాడు ఎంత చదివాడో, ఎన్నిపుస్తకాలు చదివాడో మాటల్లో చెప్పలేను. నాకంటే చిన్నోడే అయినా చాలా విషయాల్లో మార్గదర్శి. చాలా పుస్తకాలు నాకు ఇచ్చి చదవమనేవాడు. కళ్యాణ్ బాబు చెప్పిన ఎన్నో పుస్తకాలు చదవి నా వ్యక్తిత్వం మార్చుకున్నాను. వాడు అన్నిరకాల పుస్తకాలు చదివాడు. అతనికి ఉన్నంత నాలెడ్జి మాలో ఎవరికీ లేదు అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    వాడికి ప్రేమ చూపించడం తెలియదు

    వాడికి ప్రేమ చూపించడం తెలియదు

    కళ్యాణ్ బాబుకు చిన్నప్పటి నుండి తనలో ఉన్న ప్రేమను బయటకు చూపించడం తెలియదు. అప్పుడు వాడు ఐదో తరగతి ఆరో తరగతితో చదువుతున్నాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. ఎవరో నా గురించి ఎగతాళిగా మాట్లాడుకున్నారట. ఇంకోసారి మా అన్నయ్య గురించి అలా మాట్లాడితే మీ తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం నాకు అపుడు చెప్పలేదు,.. ఎప్పుడో ఏదో సందర్భంలో చెప్పాడు. ఇలా చాలా విషయాల్లో ఫ్యామిలీలో సపోర్టుగా నిలిచాడు. తాను చేసింది చెప్పుకోని వ్యక్తిత్వం వాడిది అని నాగబాబు అన్నారు.

    డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు

    డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు

    వాడు మద్రాస్ వచ్చాడు, కంప్యూటర్ కోర్స్ ఏదో చేసాడు. రాను రాను ఫ్రెండ్స్ తో కూడా తిరిగే వాడు కాదు. పబ్బులు, పార్టీలు ఎప్పుడూ లేవు. కళ్యాణ్ బాబు ఇంట్లోనే ఉండే వాడు, ఇంట్లో ఉండటం గొప్ప అని నేను చెప్పడం లేదు. పుస్తకాలు చదివేవాడు, లేదా కరాటే ఏదో నేర్చుకునే వాడు. సినిమాల్లో చేయాలనే కసి కూడా లేదు. డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేది. తన భావాలను బాగా చెప్పొచ్చనే ఉద్దేశ్యం కావచ్చు. కళ్యాణ్ బాబు డైరెక్టర్ గా కంటే హీరోగా అయితే బావుటుందని ఫ్యామిలీ మొత్తం కోరుకుంది. వదిన గారు, అన్నయ్య, అమ్మ, అల్లు రామలింగయగారి కుటుంబం అంతా కళ్యాణ్ బాబు హీరో అవ్వాలని కోరుకున్నారు. అందగాడు, ఫైర్ ఉన్న కుర్రాడు. తను కూడా మా ఆలోచన విధానాన్ని గుర్తించి నటుడిగా మారడం అనేది తను తీసుకున్న మంచి నిర్ణయం. ఎంత నటుడిగా మారిన తనలోని భావాలను అలా ఉండిపోయాయి. అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    ఆ కోరికే రాజకీయాల వైపు

    ఆ కోరికే రాజకీయాల వైపు

    మేము చాలా విషయాలు మాట్లాడుకునే వారం. ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. ఆలోచిస్తూ ఉండేవాడు. సంతోషంగా ఉండేవాడు కాదు. ఏదో కావాలి, ఏదో చేయాలి, కేవలం సినిమాలే కాదు. ఇంకా ఏదో చేయాలనే ఆలోచన ఉండేది. యాక్టింగుతో సాటిస్పై అయ్యేవాడు కాదు. అలా ఏదో చేయాలనే కోరిక రాజకీయాల వైపు కళ్యాణ్ బాబును మళ్లించింది అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    పీఆర్పీ విలీనం చేసే విషయంలో మాతో ఏకీభవించలేదు

    పీఆర్పీ విలీనం చేసే విషయంలో మాతో ఏకీభవించలేదు

    చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత అన్నయ్యకు ఎంతో సపోర్టు ఇచ్చారు. ఆ పార్టీకి కళ్యాణ్ చాలా బాగా పని చేసాడు. అయితే పార్టీని విలీనం చేసే విషయంలో మాతో ఏకీభవించలేదు. దూరంగానే ఉండిపోయాడు. మేము కూడా బలవంతం చేయలేదు. కళ్యాణ్ బాబు ఆలోచనలను గౌరవించే వారం... అని నాగబాబు చెప్పుకొచ్చారు. తర్వాత జనసేన పార్టీ పెట్టి క్వశ్చన్ చేస్తానని చెప్పాడు, ఇపుడు పరిపూర్ణమైన పార్టీగా మార్చుకున్నాడు.

    నాకు అడగకుండానే సహాయం చేసాడు

    నాకు అడగకుండానే సహాయం చేసాడు

    నేను సఫరింగులో ఉన్నపుడు నేను అడగకుండానే సపోర్టు చేసాడు నా తమ్ముడు. సహాయం చేయడం కూడా నిశ్శంబ్దంగా చేస్తాడు. నా అన్నయ్య కూడా నాకు సహాయం చేసాడు. నేను పొందిన సహాయాన్ని మరిచిపోయి సైలెంటుగా ఉండే రకం కాదు. అందుకే ఇపుడు చెబుతున్నాను. అన్నదమ్ములిద్దరు చేసిన సహాయం గుర్తు పెట్టుకున్నాను. గొప్ప అని చెప్పడం లేదు. ఆ రోజు కళ్యాణ్ బాబు ఆర్థిక పరిస్థితి దాటి సహాయం చేసాడు. అప్పుడు కూడా సహాయం చేసి అన్నయ్య నువ్వు బావుండాలి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దని సలహా ఇచ్చాడు అని నాగబాబు తెలిపారు.

    ఎన్నో మాటలు పడ్డాడు

    ఎన్నో మాటలు పడ్డాడు

    రాను రాను కళ్యాణ్ బాబు వ్యక్తిత్వానికి అభిమానులు ఏర్పడ్డారు. సినిమాల్లో ఎంత పేరు తెచ్చుకున్నాడో... అంతకంటే ఎక్కువ తన వ్యక్తిత్వంతో పేరు తెచ్చుకున్నాడు. తన పెళ్లి విషయంలో, మరికొన్ని విషయాల్లో ఎన్నో మాటలు పడ్డారు. ఎంత మంచోడంటే వారిని ఎవరినీ తిరిగి అనలేదు. అది కాదు అతడికి కావాల్సింది. తాను చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టి వెళ్లిపోవడం చేస్తుంటాడు. అందుకే తనను ఎవరైనా ఏదైనా అంటే స్పందించడు అని నాగబాబు తెలిపారు.

    నా మీద కొంతమందికి కోపం ఉంది

    నా మీద కొంతమందికి కోపం ఉంది

    నా మీద కొంత మందికి కోపం ఉంది. ముఖ్యంగా కళ్యాణ్ బాబును బాగా ఇష్టపడే వారికి. జనసేన పార్టీ పెట్టినపుడు అన్నయ్యను సపోర్టు చేసాను. అన్నయ్యను ఎందుకు సపోర్టు ఇచ్చాను అంటే మా అన్నయ్య మాకు జీవితాన్ని ఇచ్చాడు. ఆ రోజు నేను తమ్ముడితో వెళితే అన్నయ్య ఒంటరివారు అయ్యేవారు. మమ్మల్ని ఎవరైతే ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టారో వారికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ఛాయిస్ తీసుకోవాలి. నేను మా అన్నయ్య వైపు తీసుకున్నాను. అదే విధంగా కళ్యాణ్ బాబును ఎప్పుడూ ఒక మాట అనలేదు... అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    నా తమ్ముడికి నేను అసవరం లేదు

    నా తమ్ముడికి నేను అసవరం లేదు

    నా తమ్ముడికి నేను అవసరం లేదు, ఎందుకంటే హిమ్ సెల్ఫ్ హి ఈజ్ ఎ పవర్. ఆ రోజుకు గానీ ఈ రోజుకు గానీ ఎవరూ అవసరం లేదు. వాడిలోనే ఓ ఫైర్ ఉంది. మా అన్నయ్యకు నేను సపోర్టుగా ఉండాలి. ఇది నేను వ్యక్తిగతంగా తీసుకున్న బాధ్యత. కళ్యాణ్ బాబుతో రాజకీయంగా ఎప్పుడూ డిఫర్ అవ్వలేదు. నేను అన్నయ్యతోనే ఉంటాను, అది నా బాధ్యత అనే ఓ సైలెంట్ అండర్ స్టాండిగుతో ఉన్నాం. అయితే కొందరు కళ్యాణ్ బాబు అభిమానులకు కోపం వచ్చింది. ఇంత సహాయం పొందావు తమ్ముడి దగ్గర నుండి అని, అన్న దగ్గర నుండి కూడా పొందాను. ఎందుకు సపోర్టు ఇవ్వలేదంటే అది రాజకీయపరమైన అంశం. రాజకీయ అంశాన్ని రాజకీయ అంశంగానే చూడాలి. రాజకీయ పార్టీ పెట్టినపుడు దాన్ని గౌరవించానే తప్ప ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. అన్నవైపు నిలబడ్డాను. అన్న వైపు వ్యక్తిగా వచ్చాను. పార్టీ పరంగా కాదు. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అపుడు నేను ఎవరికీ వివరణ ఇవ్వలేదు. అలాంటి అవసరం కూడా లేదు అని నాగబాబు తెలిపారు.

    కొందరు చెడ్డ ఫ్యాన్స్

    కొందరు చెడ్డ ఫ్యాన్స్

    కళ్యాణ్ బాబుకు స్ట్రాంగ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందులో అభిమానం పేరు చెప్పుకుని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రతి హీరోకు ఉండే సమస్యే ఇది. కళ్యాణ్ బాబు పబ్లిక్ ఫంక్షన్లకు అటెండ్ కారు, 100 డేస్ ఫంక్షన్ కూడా ఇష్టం ఉండదు. అలాంటి పంక్షన్లలో జరిగే తొక్కిసలాట నచ్చదు. హీరో అయ్యాక కూడా అలాంటివి చేసుకోలేదు. బిగ్గెస్ట్ హిట్స్ కూడా సైలెంట్ గానే కానిచ్చేసాడు. నటించిన సినిమాలు కాబట్టి బాధ్యతగా ఆడియో పంక్షన్లకు వస్తాడు.... కళ్యాణ్ బాబు రాని పంక్షన్లలో గొడవ చేయడం మంచిది కాదు అని నాగబాబు అన్నారు.

    మెగా అభిమానులు చీలిపోయారు

    మెగా అభిమానులు చీలిపోయారు

    మెగా ఫ్యాన్స్ లో ఉంటూ కళ్యాణ్ బాబు వైపు కొందరు విడిపోయారు. తప్పేం కాదు. ఇండివ్యూజివల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తప్పులేదు. అందులో కొందరు అనవసరమైన ఆలోచనలతో కళ్యాణ్ బాబు గారికి, చిరంజీవికి పటడం లేదు... కళ్యాణ్ బాబుకు అన్యాయం చేసారని ఊహించుకుని, చిరంజీవి ఆడియో పంక్షన్, మెగా ఫ్యామిలీ ఫంక్షన్లు ఏం జరిగినా పవన్ కళ్యాణ్ పేరెత్తి అల్లరి చేయడం మొదలు పెట్టారు. నిజానికి పవన్ కళ్యాణ్ కు ఇలాంటివి ఇష్టం ఉండదు. ఇలాంటివెన్నో చూసి ఆ కొద్ది మందిపై ఆ రోజు నేను ఫైర్ అయ్యాను. ఆ విషయంఇపుడెందుకు చెబుతున్నాంటే కళ్యాణ్ బాబుకు గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ అంశం ప్రస్తావించాను అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా అది నిజం

    ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోక పోయినా అది నిజం

    ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. ఆ రోజు చంద్రబాబు, మోడీ ఇద్దరినీ నిస్వార్థంగా సపోర్టు చేసారు. కనీసం ఒక్కచోట కూడా అభ్యర్థులను నిలబెట్టలేదు. కళ్యాణ్ బాబు సపోర్టు చేయబట్టే చాలా చోట్ల న్యారో ఎడ్జ్ లో టీడీపీ పార్టీ గెలిచింది. ఇది వారు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఫ్యాక్ట్ అని నాగబాబు తెలిపారు.

    అలాంటి భయంకరమైన క్యారెక్టర్

    అలాంటి భయంకరమైన క్యారెక్టర్

    కళ్యాణ్ బాబు ఒక సమర్థుడైన రాజకీయ నాయకుడు, పార్టీ నాయకుడు. ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఎన్ని మంచి క్వాలిటీలు ఉండాలో అన్ని ఉన్నాయి. తనకు తినడానికి లేక పోయినా సరే ఉన్నది ఇచ్చేసే భయంకరమైన క్యారెక్టర్. తన భవిష్యత్ గురించి ఆలోచించడు, అది వాడి క్యారెక్టర్...ధైర్య వంతుడు, నిజాన్ని నిర్భంగా మాట్లాడతాడు, జాతీయ, అంతర్జాతీయ విషయాలమీదు, రాజకీయాల మీద చాలా పరిజ్ఞానం, అండర్ స్టాండింగ్ ఉంది అని తెలిపారు.

    తన పీక తెగినా సరే నిలబడే ధైర్యం ఉన్నవాడు

    తన పీక తెగినా సరే నిలబడే ధైర్యం ఉన్నవాడు

    తన పీక తెగిపోయినా సరే నిలబడగలిగే ధైర్యం ఉన్నావాడు. వెనకంజ వేయడు. చావో రేవో తేల్చుకునే దమ్మున్నోడు. చిన్నప్పటి నుండి అంతే. ఎప్పుడూ అబద్దం చెప్పేవాడు కాదు. నిజాలు చెప్పి తిట్లు తినేవాడు, వాడు ఒక ప్రత్యేకం, అలాంటి వారు ఉండటం చాలా అరుదు. అలాంటి వ్యక్తి పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఒక శుభ పరిణామం అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    English summary
    Pawan Kalyan is NOT Expressive says...NagaBabu. "Here is my Perspective on Pawan Kalyan's Political Journey. In this exclusive Interview, I talk about Pawan Kalyan's Political Career, Pawan Kalyan's Childhood, the knowledge he has, how Pawan Kalyan Inspired me etc" Nagababu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X