పవన్ కళ్యాణ్ కోసం నానికి షాక్!.. సుజీత్ ప్లానింగ్ అదేనా?
టాలీవుడ్ డైరెక్టర్ సుజీత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కించిన ఓజీ (OG) సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తన స్టైలిష్ మేకింగ్‌తో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కే కాదు.. సుజీత్ కెరీర్‌లో కూడా ఓ మైల్ స్టోన్ మూవీగా మారింది. అలాగే కలెక్షన్ల పరంగా ప్రత్యేక రికార్డులు నెలకొల్పుతోంది. దీంతో సుజీత్ తదుపరి సినిమా ఏంటీ అనే చర్చ మొదలైంది. ఒకవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజీ' సీక్వెల్‌గా 'ఓజీ 2' రాబోతోందని కొందరూ భావిస్తుంటే.. లేదు.. లేదు నేచురల్ స్టార్ నానితో సుజీత్ 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నారనే చర్చ మొదలైంది. దీంతో ఏ హీరోకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనేది టాప్ టాపిక్ గా మారింది.
'బ్లడీ రోమియో' ఎందుకు ఆగింది?
సుజీత్-నాని కాంబినేషన్‌లో తెరకెక్కనున్న'బ్లడీ రోమియో'సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టీజర్ కూడా విడుదల చేసి అంచనాలు పెంచారు. అయితే నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్' సినిమాతో బిజీగా ఉండగా, ఆ సినిమా షెడ్యూల్ ఆలస్యం కావడంతో సుజీత్ ప్లానింగ్ కూడా మారినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, నాని సినిమా కంటే ముందు సుజీత్ 'ఓజీ 2' పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నాని అభిమానుల్లో నిరాశ నెలకొంది.

ముందు 'ఓజీ 2'... తర్వాతే నాని సినిమా?
అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో 'ఓజీ 2' కథా చర్చలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ దాదాపు చివరిదశకు చేరుకుందని, అధికారిక ప్రకటన తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశముందని ప్రచారం సాగుతోంది. దీంతో 'బ్లడీ రోమియో'ను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. టాక్ ప్రకారం.. సుజీత్ ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులను నిర్వహించాలనే ఆలోచనలో లేరట. ముందుగా 'ఓజీ 2' పూర్తి చేసి, ఆ తర్వాతే నానితో 'బ్లడీ రోమియో'ను పట్టాలెక్కించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట 'ఓజీ 2' పైనే దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 'బ్లడీ రోమియో' వచ్చే ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సుజీత్-నాని కాంబో కోసం ఎదురుచూపులు
'రన్ రాజా రన్'తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుజీత్, తర్వాత 'సాహో', 'ఓజీ' వంటి భారీ సినిమాతో తన మార్క్ చూపించారు. 'సాహో' తర్వాతే నానితో సినిమా చేయాలని ఆయన భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కథా చర్చలు కూడా జరిగాయని ప్రచారం జరిగింది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి అవకాశం రావడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడిందని ఇండస్ట్రీలో అప్పటినుంచే వినిపిస్తోంది. నాని కూడా గతంలో పలుమార్లు సుజీత్‌తో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం నాని తన 'ది ప్యారడైజ్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఆ సినిమా పూర్తయ్యాక తదుపరి ప్రాజెక్ట్ ఏదనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. ఒకవేళ 'బ్లడీ రోమియో' మరింత ఆలస్యమైతే, నాని మధ్యలో మరో దర్శకుడితో సినిమా చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. 'ఓజీ 2' షూటింగ్, 'బ్లడీ రోమియో' షెడ్యూల్‌పై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందువల్ల ఈ ప్రాజెక్టులపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications



