»   » షాకింగ్ సీక్రెట్ లీక్: సంజయ్ దత్‌ను రహస్యంగా పెళ్లాడిన రేఖ?

షాకింగ్ సీక్రెట్ లీక్: సంజయ్ దత్‌ను రహస్యంగా పెళ్లాడిన రేఖ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ జీవితచరిత్రపై 'రేఖ- ది అన్‌టోల్డ్‌ స్టోరీ' పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. రచయిత యాస్సర్‌ ఉస్మాన్‌ ఈ పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం నుండి నటి రేఖకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

తాజాగా ఈ పుస్తకం ఆధారంగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల కిందట సంజయ్ దత్, రేఖ రహస్యంగా వివాహం చేసుకున్నారని, పెళ్లయిన తర్వాత ఇద్దరూ ముంబై నుండి నుండి దూరంగా వెళ్లి కొన్ని రోజులు గడిపారని తాజాగా రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

ప్రేమలో పడ్డారు

ప్రేమలో పడ్డారు

1984లో వచ్చిన జమీన్‌ ఆస్మాన్‌ సినిమా చిత్రీకరణ సమయంలో రేఖ, సంజయ్‌ ప్రేమించుకున్నారని, అదే సమయంలో ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నారని, అయితే సంజయ్‌ తండ్రి సునీల్‌దత్‌ కు వీరి వ్యవహారం ఇష్టం లేక పోవడంతో...వెంటనే సంజయ్‌కి రిచాశర్మతో వివాహం జరిపించినట్లు ప్రచారం జరుగుతోంది.

భర్త చనిపోయినా కుంకుమ అందుకే

భర్త చనిపోయినా కుంకుమ అందుకే

రేఖ భర్త ముఖేశ్‌ అగర్వాల్‌ చనిపోయిన తర్వాత కూడా రేఖ నుదుటిపై కుంకుమ పెట్టుకోవడానికి కారణం..... ఫ్యాషన్ కోసమో, అమితాబ్ కోసమో కాదని.... సంజయ్ తో ఆమె రహస్య వివాహం జరుగడమే అసలు కారణమని తాజాగా ప్రచారం జరుగుతోంది.

నేను అలా రాయలేదంటున్న రచయిత

నేను అలా రాయలేదంటున్న రచయిత

‘రేఖ- ది అన్‌టోల్డ్‌ స్టోరీ' లో తాను అసలు రేఖ-సంజయ్ దత్ పెళ్లి జరిగినట్లు రాయలేదని, వారికి రహస్యంగా వివాహం జరిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని రచయిత యాస్సర్‌ ఉస్మాన్‌ తేల్చి చెప్పారు. పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా ఇలా అవాస్తవాలు ప్రచారంలోకి తేవడం సరికాదన్నారు.

యాస్సర్ ఉస్మాన్ ఏం రాసారు?

యాస్సర్ ఉస్మాన్ ఏం రాసారు?

‘రేఖ- సంజయ్‌ జమీన్‌ ఆస్మాన్‌ షూటింగ్ సమయంలో ప్రేమించుకుంటున్నట్లు పుకార్లు వచ్చాయి, కొంతమందైతే వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు ప్రచారం చేసారు. ఈ ప్రచారం ఎక్కువ కావడంతో అలాంటిదేమీ లేదని సంజయ్ దత్ అప్పట్లో ఓ మ్యాగజీన్‌ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు' అని యూస్సర్ ఉస్మాన్ పుస్తకంలో రాసారు.

సీనియర్ నటి రేఖ ఆత్మకథ: చెప్పు దెబ్బలు, ఎన్నో చీకటి కోణాలు....

సీనియర్ నటి రేఖ ఆత్మకథ: చెప్పు దెబ్బలు, ఎన్నో చీకటి కోణాలు....

బాలీవుడ్ సినీ చరిత్రలో కలకాలం గుర్తిండిపోయే నటీ మణుల్లో సీనియర్ నటి రేఖ ఒకరు. ఒకప్పుడు నటిగా వెండితెర సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న రేఖ.... ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో సంచలనాలు. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే లవ్ ఎఫైర్లు నడిపి, సీక్రెట్ మ్యారేజీలు లాంటి చేసుకుని హాట్ టాపిక్ అయింది. రేఖ గురించి బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే. బయటకు రాని చీకటి కోణాలు చాలా ఉన్నాయి... మరిన్ని పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

స్టార్స్...వింతగా, కెమెడీగా, వివాదాస్పదంగా (ఫోటోలు)

స్టార్స్...వింతగా, కెమెడీగా, వివాదాస్పదంగా (ఫోటోలు)

సినీ రంగానికి సంబంధించి సెలబ్రిటీలు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం ఫోటో షూట్లలో పాల్గొనడం మామూలే. ఈ ఫోటో షూట్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ ఉన్నారు. చెత్తగా ఉందనే పేరు మూటగట్టుకున్న వారు కూడా ఉన్నారు. మరికొన్ని ఫోటో షూట్లు కొందరు సెల్రబిటీలను వివాదాల పాలయ్యేలా చేసాయి..... పూర్తి వివరాలు, ఫోటోల కోసం క్లిక్ చేయండి.

English summary
As shocking as it might sound, rumours are doing the rounds that Rekha was secretly married to Sanjay Dutt and that's the reason why the actress applies vermillion on her forehead all the time. These shocking revelations were made by biographer Yasser Usman who authored the book 'Rekha - The Untold Story.' Also, when asked if these rumours are indeed true, Yasser said that it's only a rumour and one must read the book thoroughly to know the truth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu