For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ నటి రేఖ ఆత్మకథ: చెప్పు దెబ్బలు, ఎన్నో చీకటి కోణాలు....

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బాలీవుడ్ సినీ చరిత్రలో కలకాలం గుర్తిండిపోయే నటీ మణుల్లో సీనియర్ నటి రేఖ ఒకరు. ఒకప్పుడు నటిగా వెండితెర సెన్సేషన్ గా పేరు తెచ్చుకున్న రేఖ.... ఇటు పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో సంచలనాలు.

  బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే లవ్ ఎఫైర్లు నడిపి, సీక్రెట్ మ్యారేజీలు లాంటి చేసుకుని హాట్ టాపిక్ అయింది. రేఖ గురించి బయటి ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే. బయటకు రాని చీకటి కోణాలు చాలా ఉన్నాయి.

  తాజాగా ఆ చీకటి కోణాలన్నీ తెలుసుకునే అవకాశం ఆమె అభిమానులకు దక్కింది. రేఖ ఆత్మకథను యాస్సెర్‌ ఉస్మాన్‌ 'రేఖ...ది అన్టోల్డ్‌ స్టోరీ' పేరిట పుస్తక రూపంలోకి తెచ్చారు. అందులో ఎన్నో సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

  చెప్పుకుండానే రేప్ సీన్లోకి దించారు!

  చెప్పుకుండానే రేప్ సీన్లోకి దించారు!

  రేఖ నటించిన తొలి హిందీ చిత్రం ‘అంజనా సఫర్‌'. ఈ సినిమా ఒప్పుకునే సమయంలో ఇందులో రేప్ సీన్ ఉంటుందని చెప్పలేదట. సరిగ్గా షూటింగ్ జరిగే రోజే ఆ సీన్ ఉందని చెప్పారట, బిశ్వజిత్‌ అత్యాచారం చేసే సన్నివేశం అది. అలా సడెన్ గా చెప్పి చేయడం వల్లనే ఆ సీను బాగా పండిందట.

  రహస్య వివాహం, చెప్పు దెబ్బలు

  రహస్య వివాహం, చెప్పు దెబ్బలు

  అప్పట్లో రేఖ-వినోద్‌ మెహ్రా ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి దండలతో ఇద్దరూ ఇంటికెళ్లారు. అయితే వినోద్‌ మెహ్రా తల్లి రేఖాను ఇంట్లోకి అడుగు పెట్టయలేదట. ఈ సందర్భంగా జరిగిన గొడవలో రేఖను చెప్పుతో కొట్టి వెనక్కి పంపిందట ఆమె...ఈ విషయాలన్నీ రేఖా ఆత్మకథలో ఉన్నారు.

  చాలా విషయాలు..

  చాలా విషయాలు..

  వినోద్ మెహ్రాతో తెగదెంపులు తర్వాత రేఖ ముఖేష్‌ అగర్వాల్‌ను పెళ్ళాడినట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. అయితే వీరూ కొంతకాలానికే విడిపోయారు. రేఖ దుపట్టా మెడకు చుట్టుకొని ముఖేష్‌ అగర్వాల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయంలో రేఖను ముద్దాయిగా అనుమానించారు కూడా ఇలా ఎన్నో విషయాలు ఈ ఆత్మకథ పుస్తకంలో కూలకషంగా ఉన్నాయి.

  ఓ పుస్తకమే రాయొచ్చు

  ఓ పుస్తకమే రాయొచ్చు

  అమితాబ్‌బచ్చన్‌తో రేఖ నడిపిన ప్రేమాయణం గురించి ఓ పుస్తకమే రాయొచ్చు. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులు ఇద్దరూ విడిపోయేలా చేసాయి. తర్వాత అమితాబ్ జయా బచ్చన్ ను పెళ్లాడారు.

  రేఖ-జయ వార్..

  రేఖ-జయ వార్..

  అమితాబ్ విషయంలో రేఖ, జయ మధ్య పెద్ద వార్ జరిగింది. ఈ వార్ లో అమితాబ్ ను తన సొంతం చేసుకుంది జయ. రేఖతో కలిసి అమితాబ్‌ సినిమాల్లో నటించకుండా జయా బచ్చన్‌ కట్టడి చేస్తే, ఆమెను రేఖ ఒక అవార్డు ఫంక్షన్‌లో టార్గెట్‌ చేసి బహిరంగంగా అవమానించింది.. ఇలా ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

  సౌత్ నుండి బాలీవుడ్లోకి

  సౌత్ నుండి బాలీవుడ్లోకి

  రేఖ సౌతిండియాకు చెందిన వ్యక్తి. ప్రసిద్ధ తమిళ నటుడు జెమిని గణేషన్, తెలుగు నటి పుష్పవల్లి లకు జన్మించింది. అయితే వీరికి పెళ్లి జరుగలేదు. రేఖను తన కూతురుగా జెమీని గణేషన్ ఒప్పుకోలేదు కూడా. 1970లో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోయే ముందు ఆమె తన పుట్టు పూర్వోత్తరాలు వెల్లడించారు.

  తండ్రి నిరాదరణపై ద్వేషం

  తండ్రి నిరాదరణపై ద్వేషం

  బాలీవుడ్ సినిమాల్లో తాను మంచి రేంజికి వచ్చిన తర్వాత ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తండ్రి యొక్క నిరాదరణ ఇంకనూ ద్వేషాన్ని కలిగిస్తోందని ఆమె తెలిపారు. రేఖ తన వృత్తి జీవితంలో దాదాపు 200 చిత్రాలలో నటించింది.

  English summary
  Rekha: The Untold Story is actually the Rekha story re-told but all the material at one place together helps the reader make more sense of the actress who went through numerous ups and downs and whose resplendent presence still make the cameras zoom in.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X