హైదరాబాద్‌లో ప్రభాస్ రాజ భవనం.. ఎన్ని వందల కోట్లతో విలాసవంతమైన ఇల్లు అంటే?

ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌గా దూసుకెళ్తున్నారు ప్రభాస్. ఆయన సినిమాల బడ్జెట్, వసూళ్లు, మార్కెట్‌కు దరిదాపుల్లో బాలీవుడ్ హీరోలు కూడా లేరంటే అతిశయోక్తి లేదు. బాహుబలి, కల్కి 2898 ఏడీ సినిమాలతో ప్రభాస్ అంతర్జాతీయంగానూ క్రేజ్ సంపాదించుకున్నారు. త్వరలో రాబోతున్న సినిమాలతో ఆయన స్థాయి మరింత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన రేంజ్‌కు తగిన విధంగా ప్రభాస్ హైదరాబాద్‌లో తన డ్రీమ్ హౌస్‌ను నిర్మిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు ప్రభాస్. తొలుత లవర్ బాయ్‌గా అలరించిన ప్రభాస్ కెరీర్‌ను ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీ మలుపు తిప్పింది. ఈ సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్న ప్రభాస్.. ఆ వెంటనే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో హిట్స్ కొట్టారు. ఇక బాహుబలితో ఆయన గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్నారు. ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బడా నిర్మాతలు, దర్శకులు క్యూకడుతున్నారు. వరుస ప్రాజెక్ట్స్‌తో బాలీవుడ్ హీరోలను ఎప్పుడో దాటేసిన యంగ్ రెబల్ స్టార్.. ప్రస్తుతం ఫాజీ, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు డార్లింగ్ రెడీ అవుతున్నారు.

Prabhas to build Dream Mansion in Hyderabad Here Is the Estimated value and features of Pan-India Star s Luxury Home

ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం.. వివాదరహితుడిగా, మంచి మనిషిగా సినీ ప్రమఖుల నుంచి అభిమానుల వరకు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ఏకైక హీరో ప్రభాస్. నిరాడంబరమైన జీవితం, మీడియాకు దూరంగా ప్రశాంతంగా గడుపుతున్నారు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. 25 ఏళ్ల కెరీర్‌లో ప్రభాస్ బాగానే సంపాదించారు. ఆయనకు హైదరాబాద్, ముంబైతో పాటు ఇటలీలో నివాసాలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది, రాయదుర్గంలో ఓ ఫాంహౌస్ ఉంది. ఆయన ఆస్తుల విలువ 300 నుంచి 450 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.

Recommended For You
మహేశ్ బాబుతో మూవీని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. లీక్ చేసిన డైరెక్టర్
మహేశ్ బాబుతో మూవీని రిజెక్ట్ చేసిన రజనీకాంత్.. లీక్ చేసిన డైరెక్టర్

అయితే ప్రస్తుతం తనకు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ దక్కడం.. తనని కలవడానికి వచ్చే సినీ ప్రముఖులు, అభిమానులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోనే విశాలమైన, విలాసవంతమైన ఇంటి నిర్మాణానికి ప్రభాస్ పూనుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ విస్తరించి ఉన్న కోకాపేట ఏరియాలో ప్రభాస్ రెండెకరాల స్థలం కొన్నారు. ఇక్కడే తన డ్రీమ్ హౌస్‌ను ఆయన నిర్మించనున్నారట. ఇక్కడ నిర్మాణాలకు ప్రభుత్వపరమైన అనుమతులు లభించడంతో తన లగ్జరీ డ్రీమ్ హౌస్‌ను నిర్మించే పనిలో పడ్డారు డార్లింగ్.

You May Also Like
ప్రభాస్ నుంచి అదే దోచుకొంటా.. రాధేశ్యామ్ షూటింగ్‌లో డార్లింగ్ అలా.. పూజా హెగ్డే
ప్రభాస్ నుంచి అదే దోచుకొంటా.. రాధేశ్యామ్ షూటింగ్‌లో డార్లింగ్ అలా.. పూజా హెగ్డే

గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు ఇక్కడి నుంచి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా వెళ్లొచ్చు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్‌కు కూడా ఈ ప్రాంతం దగ్గరిలోనే ఉండటం కూడా ప్రభాస్‌ను ఇక్కడ తన మ్యాన్షన్ నిర్మించేలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. తన డ్రీమ్ హౌస్‌లో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేయించుకోనున్నారట ప్రభాస్. ముఖ్యంగా ఫిట్‌నెస్ సెంటర్, ప్రైవేట్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, విశాలమైన గార్డెన్ ఏరియా ఉంటాయట. ఈ భారీ భవన నిర్మాణం పూర్తవ్వడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఆషాడంలో దొరబాబు కరువు... లవర్ కోసం టైం మెషిన్‌‌లోకి రోహిణి!
ఆషాడంలో దొరబాబు కరువు... లవర్ కోసం టైం మెషిన్‌‌లోకి రోహిణి!

ఇక ఈ లగ్జరీ ప్యాలెస్ ఎంత ఉండొచ్చన్న దానిపైనా రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. కోకాపేట, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలలో ఎకరం భూమి విలువ 80 కోట్ల రూపాయల పైమాటే.. ఈ లెక్కన ప్రభాస్ కేవలం స్థలం కోసమే 160 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లుగా తెలుస్తోంది. నిర్మాణంతో కలిపి ఈ భవనం విలువ ఎంత పెరుగుతుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X