ఆషాడంలో దొరబాబు కరువు... లవర్ కోసం టైం మెషిన్‌‌లోకి రోహిణి!

Photo Courtesy: ETV Telugu India

తెలుగు ప్రేక్షకులను 13 ఏళ్లుగా అలరిస్తోన్న జబర్దస్త్ కామెడీ షో ఎప్పటికప్పుడు సరికొత్తగా రెడీ అవుతోంది. ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబైంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ తాజాగా విడుదల చేసింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలా చేశారు? ఎవరి పంచ్‌లు బాగా పేలాయి? టోటల్‌గా ప్రోమో ఎలా ఉంది? అనేది పరిశీలిస్తే..

Also Read
Rao Bahadur Closing Collections: రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rao Bahadur Closing Collections: రావు బహదూర్ క్లోజింగ్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

తొలుత రాంప్రసాద్, రైజింగ్ రాజు, దొరబాబులు ఎంట్రీ ఇస్తారు. రేపటితో ఆషాడం వెళ్లిపోతోంది మిమ్మల్ని వదిలి వెళ్లలేను అంటుంది కూతురు. అమ్మాయి రేపు వెళ్లిపోతుందట త్వరగా పంపించేయ్ అని రాంప్రసాద్ అనడంతో తల్లీకూతుళ్లు షాక్ అవుతారు. లేకపోతే 50 కేజీల బస్తా మనిద్దరికీ రెండు నెలలు వస్తుంది, 15 రోజుల్లో తినేసింది అంటాడు రాంప్రసాద్. పెళ్లాం కోసం దొరబాబు అత్తారింటిలోకి రాబోతుండగా వాకిట్లోనే ఆపేస్తాడు రాంప్రసాద్. ఆషాడ మాసం మా గడప దాటకూడదని మండిపడతాడు. మీ అమ్మాయిని చూసి నెల రోజులు అవుతోంది.. అసలే ఆషాడ మాసం ఒకసారి చూసి వెళ్లిపోదామనుకుంటున్నానని రగిలిపోతాడు దొరబాబు.

Jabardasth Latest Promo Ram Prasad Bullet Bhaskar Rohini Deliver Non-Stop Laughs in Ashada Masam Special

Photo Courtesy: ETV Telugu India

రేపు మార్నింగ్ పంపించేస్తానని రాంప్రసాద్ చెప్పగా.. రేపు ఉదయం 3 గంటలకు ఫ్లైట్.. దుబాయ్ వెళ్తున్నా మూడు నెలలు రాను అంటాడు దొరబాబు. ఇంతలో రైజింగ్ రాజు వచ్చి ఆషాడంలో మీరు అత్తగారి ముఖం చూడకూడదని అంటాడు. మామూలు రోజుల్లోనే మీ ముఖం చూడను, అలాంటిది ఆషాడంలో ఏం చూస్తానని కౌంటర్ వేస్తాడు దొరబాబు. ఆ వెంటనే భార్య గుమ్మానికి అవతల నిలబడి కాఫీ ఇవ్వడంతో ఆమెకు సైట్ కొడతాడు దొరబాబు. రాత్రి అందరూ నిద్రపోతుండగా భార్యని లేపి తీసుకెళ్తుండగా రాంప్రసాద్‌కి దొరికిపోతాడు దొరబాబు. పొద్దున్నే ఫ్లైట్‌కి వెళ్లాలి.. మిమ్మల్ని మిస్ అవుతున్నానని అంటాడు. నీ పట్టుకి లుంగి జారి పోయిందని రాంప్రసాద్ అనడంతో అంతా నవ్వేస్తారు.

Recommended For You
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం

ఇక తర్వాతి స్కిట్‌లో రోహిణి, పంచ్ ప్రసాద్, తాగుబోతు రమేశ్‌లు వస్తారు. నేను మీకు ఎప్పటి నుంచో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను, కంగారుగా ఉందని రోహిణితో అంటాడు పంచ్ ప్రసాద్. ఇంతలో రెండేళ్ల తర్వాత రోహిణికి తాగుబోతు రమేశ్‌తో పెళ్లవుతుంది. ఒకడు నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను, వాడినే కాకుండా చాలామందిని రిజెక్ట్ చేసి ఈ ఎదవన్నర ఎదవని చేసుకున్నాను. పిసినారి ఎదవ 2023లో ఒక పేస్ట్ కొన్నాడు.. మూడు సంవత్సరాల నుంచి వాడుతూనే ఉన్నాడని రోహిణితో చెప్పడంతో అంతా నవ్వేస్తారు. ఇంతలో ఒక వ్యక్తి నేను టైం మెషిన్‌లో 2030 నుంచి వచ్చానని చెప్పడంతో నేను కూడా వెనక్కి వెళ్తానని పంచ్ ప్రసాద్ తనకు ప్రపోజ్ చేస్తున్న కాలానికి వెళ్తుంది. ప్రసాద్ తన ప్రేమ విషయం చెబుతుండగా తాతయ్య చనిపోయినట్లుగా ఫోన్ వస్తుంది. మీ తాత చనిపోయినా పర్లేదు కానీ రింగ్ పెట్టేయమని రోహిణి చెప్పడంతో అంతా నవ్వేస్తారు.

You May Also Like
ఇంద్రజకు అవమానం.. బుల్లెట్ భాస్కర్‌‌‌పై సీరియస్
ఇంద్రజకు అవమానం.. బుల్లెట్ భాస్కర్‌‌‌పై సీరియస్

ఇక జ్యోతిష్యుడ్ కమ్ ఆయుర్వేద వైద్యుడిగా ధనాధన్ ధన్‌రాజ్ నవ్వించాడు. పేషెంట్‌కి శానిటైజర్, తీర్ధం కలిపి ఇవ్వడంతో అతను కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఉదయాన్నే వచ్చిన ఫస్ట్ పేషెంట్‌కి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తాడు. ఒక జంట మాకు పిల్లలు పుట్టడం లేదని చెప్పడంతో భార్య చేయి చూసి నీకు ఇద్దరు మగపిల్లలు పుడతారని, భర్త చేయి చూసి నీకు సంతాన రేఖ లేదని అనడంతో అంతా నవ్వేస్తారు. మరో స్కిట్‌లో రాకెట్ రాఘవ, అప్పారావు, మోహనలు ఎంట్రీ ఇస్తారు. భార్య బర్త్ డే సెలబ్రేషన్స్‌కి వచ్చిన అప్పారావుకి మొన్న గాలికి మీ మేడ మీద ఆరేసిన చొక్కా మా ఇంట్లో పడిందని రాఘవ ఇవ్వగా.. ఈ చొక్కా మా ఆయనది కాదని చంకలో పెట్టుకుంటాడు అప్పారావు. కేక్ కట్ చేయడానికి ఓపెన్ చేయగా అది ఎవరో కూర్చొన్నట్లుగా నలిగిపోతుంది. ఇది కేకా? ఇందకా అక్కడ కూర్చొంటే చల్లగా తగిలింది, కింద ఏసీ పెట్టారేమోనని అనుకున్నానని చెప్పడంతో అందరూ నవ్వుకుంటారు.

Lenin Box Office Collections: 5వ రోజు లెనిన్ బాక్సాఫీస్ జోరు.. అఖిల్ మూవీకి ఎన్ని కొట్లంటే?
Lenin Box Office Collections: 5వ రోజు లెనిన్ బాక్సాఫీస్ జోరు.. అఖిల్ మూవీకి ఎన్ని కొట్లంటే?

భార్యాభర్తలు, విడాకుల గొడవతో బుల్లెట్ భాస్కర్, శాంతిలు నవ్వించారు. నాకొక పాప కావాలంటే మీ అమ్మాయి ఇవ్వనంటోంది, అందుకే విడాకులు తీసుకుంటానని చెబుతాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటుండగా నాన్న అంటూ భాస్కర్ దగ్గరికి వస్తారు పిల్లలు. అమ్మ సరిగా స్కూల్ ఫీజు కట్టడం లేదని చెప్పడంతో నెలకి 50 రూపాయలు ఇస్తుంటే స్కూల్ ఫీజు కట్టవా అంటూ భార్యపై మండిపడతాడు. పిల్లల్ని పడుకోబెట్టి వస్తానని రెండో భార్యకి చెప్పగా వాళ్లు భాస్కర్‌ను వదిలి ఉండకపోవడంతో భార్య చిరాకు పడుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆషాడ మాసంలో దొరబాబు తన భార్యకి దగ్గరయ్యాడా? జ్యోతిష్యుడిగా డాక్టర్‌గా ధనరాజ్ ఎలా మెయింటైన్ చేశాడు? రాఘవ భార్య బర్త్ డే వేడుకల్లో ఏం జరిగింది? బుల్లెట్ భాస్కర్ శోభనం జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే జూలై 17, 18 తేదీలలో ప్రసారమయ్యే జబర్దస్త్ చూసేయాల్సిందే.

Read more about: indraja rashmi gautam jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X