లైగర్ డిజాస్టర్ తర్వాాత జనగణమన గురించి విజయ్ దేవరకొండ.. సైమా వేడుకల్లో ఏం చెప్పారంటే?

'లైగ‌ర్' సినిమా విడ‌ద‌ల‌కు ముందు క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన హ‌డావిడి ఇలా ఇలా లేదు. అస‌లు ఈ సినిమా వ‌సూళ్ల ప్రారంభ‌మే రూ.200 కోట్ల‌తో ఉంటుందని, ఇండియాను ఈ సినిమా షేక్ చేస్తుందంటూ పెద్ద పెద్ద ప్ర‌క‌ట‌న‌లిచ్చాడు. తీరా సినిమా విడుద‌లై తెర‌మీద బొమ్మ ప‌డిన త‌ర్వాత విజ‌య్‌ను ప్రేక్ష‌కులు ఒక ఆట ఆడుకున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందు పెద్ద పెద్ద ఎలివేష‌న్లిచ్చాడ‌ని, రెండోరోజుకే థియేట‌ర్ల‌లో జ‌నాలెవ‌రూ లేర‌ని, కాస్తంత అహం తగ్గించుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. భారీ డిజాస్ట‌ర్ అవడంతో లైగర్ గురించి విజయ్ కూడా ఎక్కడా మాట్లాడ‌లేదు.

ఘనంగా ప్రారంభోత్సవం

ఘనంగా ప్రారంభోత్సవం

బెంగ‌ళూరులో జ‌రిగిన 'సైమా' ప‌దో వార్షికోత్స‌వ వేడుక‌ల‌కు హాజ‌రైన సంద‌ర్భంలో మీడియా అత‌డిని ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు అడిగింది. 'జ‌న‌గ‌ణ‌మ‌న' గురించి ఓ విలేక‌రి ప్ర‌శ్నించారు.

'లైగ‌ర్' త‌ర్వాత పూరి-విజ‌య్ కాంబినేష‌న్లో తెర‌కెక్కాల్సిన ఈ సినిమాకు కొన్నాళ్ల క్రితం వైభ‌వంగా ప్రారంభోత్స‌వం చేశారు. లైగ‌ర్ పోయిన త‌ర్వాత ఈ సినిమా ఆపేస్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ను అటు పూరీకానీ, ఇటు విజ‌య్ కానీ అధికారికంగా ఎక్క‌డా ప్ర‌క‌ట‌న ఇవ్వ‌లేదు.

వేడుకల ఫంక్షన్ ను ఆస్వాదిద్దాం

వేడుకల ఫంక్షన్ ను ఆస్వాదిద్దాం

'జ‌న‌గ‌ణ‌మ‌న' గురించి అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ స‌మాధానం దాట‌వేశాడు. సైమా వేడుక‌ల‌ను ఆస్వాదించ‌డానికే ఇక్క‌డ‌కు వ‌చ్చామ‌ని, మ‌నంద‌రం ఈ ఫంక్ష‌న్ ఆస్వాదిద్దామంటూ చెప్పాడు. సాధార‌ణంగా దేవ‌ర‌కొండ‌కు ఒక అలావాటు ఉంది. గ‌తంలో త‌న సినిమాలేమైనా ఫ్లాపైనా స‌మాధానాలివ్వ‌డానికి ఎక్క‌డా ఇబ్బందిప‌డ‌లేదు.

విలేక‌రుల అడిగే ఇబ్బందిక‌ర ప్ర‌శ్న‌ల‌కు కూడా సులువుగా స‌మాధానం చెప్పేవాడు. అలాంటి హీరో 'జ‌న‌గ‌ణ‌మ‌న' గురించి అడితే స‌మాధానం చెప్ప‌లేక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 'లైగ‌ర్' ఎఫెక్ట్ విజ‌య్‌మీద భారీగా ప‌డింద‌నేదానికి ఇంత‌కంటే సాక్ష్యం ఏంకావాల‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

 'ఖుషీ' అయిన తర్వాతే.. ఏదైనా

'ఖుషీ' అయిన తర్వాతే.. ఏదైనా

ప్ర‌స్తుతానికి విజ‌య్ దేవ‌ర‌కొండ దృష్టి అంతా 'ఖుషీ' మీదే ఉంది. ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇది పూర్త‌యిన త‌ర్వాతే కొత్త సినిమా చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు. అత‌ని కోసం దిల్ రాజు కూడా ద‌ర్శ‌కుల‌తో మాట్లాడుతూ క‌థ‌ను సిద్ధం చేయించే ప‌నిలో ఉన్నాడు. ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ తీసిన ద‌ర్శ‌కులు రాజ్‌, డీకే ఒక క‌థ వినిపించార‌ని, అది కూడా సిద్ధ‌మ‌వ్వొచ్చ‌ని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X