రోజుకి 100 కోట్లు ఇచ్చినా అలా చేయను.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ షాకింగ్‌గా..
సమాజంతో మనకు పనిలేదు అన్నట్లుగా నచ్చినట్లుగా జీవించేవారు కొందరు ఉంటారు. ఈ కోవలకే వస్తారు హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ. మనసులో ఉన్నది ఎలాంటిదైనా సరే కుండబద్థలు కొట్టడంలో ఆమె ముందుంటారు. పెళ్లి, పిల్లల దగ్గరి నుంచి రిలేషన్ వరకు ఏ అంశంలోనైనా ముక్కుసూటిగా ఉంటారు. తాజాగా మరోసారి ఐశ్శర్య లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మెడిసిన్ చదివి సినీ రంగంలోకి అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఐశ్వర్య లక్ష్మీ. గ్లామర్ షోకు దూరంగా కథా బలమున్న సినిమాలలో నటిస్తున్నారు. థగ్ లైఫ్, మామన్, కింగ్ ఆఫ్ కోత, మట్టి కుస్తి, పొన్నియన్ సెల్వన్ 2తో పాటు తెలుగులో గాడ్సే సినిమాలోనూ ఆమె నటించారు. ప్రస్తుతం మెగా హీరో సాయి దుర్గా తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు అనే సినిమాలో ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ సరసన ఆమె నటించిన మూవీ మట్టి కుస్తీ 2. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సోషల్ మీడియాపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐశ్వర్య లక్ష్మీ.

మట్టి కుస్తీ 2 మూవీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనన్న సందేశాన్ని మా సినిమా తెలియజేస్తోంది. ఒక మహిళ ఆశయాల్ని నెరవేర్చుకోవడానికి పురుషుడు ఎలా తోడుగా నిలిచాడన్నదే మా సినిమా ఇతివృత్తం. ఉదాహరణకు ప్రియాంక చోప్రాకు ఆమె భర్త నిక్ జోనాస్ ప్రతి విషయంలోనూ అండగా ఉంటాడని ఐశ్వర్య గుర్తుచేశారు.
సోషల్ మీడియాలో ఉండటం సేఫ్ కాదన్నది నా అభిప్రాయం. దానిని వినియోగించకుండా పని చేయడం చాలా సులభం. సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన లేదు. గతంలో నా ఫోటోలను మార్ఫింగ్ చేయడం, అభ్యంతర కామెంట్స్ చేయడం వల్ల అందరూ నన్ను ద్వేషిస్తున్నట్లుగా అనిపించేది. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులను నేరుగా కలవడం చాలా ఆనందంగా ఉంది. రోజుకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ తాను సోషల్ మీడియా జోలికి పోనని కుండబద్ధలు కొట్టారు ఐశ్వర్య. తన సినిమాల విశేషాలు, రోజువారి అంశాలపై ట్రెండింగ్‌లో ఉండటానికి మాత్రం నా కుక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వినియోగిస్తానని తేల్చిచెప్పారు.
మట్టి కుస్తీ 2 తర్వాత తాను ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు. అలాగే ఐశ్వర్యానంద్ దర్శకత్వంలో రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీకి కూడా సంతకం చేసినట్లు తెలిపింది. ఈ కథ 1996 నాటిది.. కానీ దీని ఇతివృత్తం ఈ కాలానికి కూడా సరిగ్గా సరిపోతుంది, తెల్లవారుజామున 3.30 గంటల వరకు కూడా ఈ సినిమా మ్యూజిక్ గురించి మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. త్వరలో బాలీవుడ్ ఎంట్రీతో పాటు రెండు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నట్లు ఐశ్వర్య చెప్పారు.
కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాకు ఐశ్వర్య లక్ష్మీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా అనే ఆటలో నేను ఉండాలంటే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండాలి.. కొన్ని అంశాల్లో ఈ సాధనం నాకు అనుకూలంగా ఉంటుందని భావించాను. కానీ ఇది నా పనిని పూర్తిగా డిస్ట్రబ్ చేసింది, నా ఆలోచనలను సోషల్ మీడియా దోచుకుంది, నా చిన్న చిన్న ఆనందాలను కూడా బాధగా మార్చేసింది. సోషల్ మీడియాకు దూరంగా ఉన్న వారిని ప్రజలు మరిచిపోతారని తెలిసినా నేను ఆ సాహసం చేస్తున్నట్లు అప్పట్లో ఐశ్వర్య లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.


Click it and Unblock the Notifications



