‘పెళ్లిపై నమ్మకం లేదు... అలాంటి వ్యక్తి దొరికితే అతనితో బిడ్డనుకంటా’

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఎందరో ఉన్నారు. సల్మాన్ ఖాన్, ప్రభాస్, అనుష్క, త్రిష వంటి సూపర్‌స్టార్లు ఇప్పటికీ బ్యాచిలర్స్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. పెళ్లి గురించి అడిగితే నవ్వేసి ఊరుకోవడం తప్పించి ఆన్సర్ మాత్రం వీరు చెప్పరు. వీరి పెళ్లిపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. అయితే పెళ్లిపై ఎవరి అభిప్రాయం వాళ్లదే. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Also Read
Rao Bahadur Overseas Day 1 Collection: రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?
Rao Bahadur Overseas Day 1 Collection: రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్.. సత్యదేవ్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

ఆ నటి ఎవరో కాదు ఐశ్వర్య లక్ష్మీ. డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన స్టార్స్‌లో ఆమె కూడా ఒకరు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఐశ్వర్య .. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి 2017లో ఎంబీబీఎస్ పట్టా పొందారు. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసిన ఐశ్వర్యకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు. అయితే 2017లో అత్లాఫ్ సలీమ్ ఈమె ఇచ్చిన ఆడిషన్స్‌కి ఫిదా అయిపోయి నవిన్ పౌలే సరసన నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఐశ్వర్యకు ఆఫర్లు పోటెత్తాయి. ఇక తప్పనిసరి పరిస్ధితుల్లో నటిగా స్థిరపడిపోయారు ఐశ్వర్య లక్ష్మీ.

Aishwarya Lekshmi says she reconsider about marriage and Motherhood

విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు ఐశ్వర్య లక్ష్మీ. ప్రస్తుతం సాయిథరమ్ తేజ్ సరసన సంబరాల ఏటి గట్టు, మలయాళంలో ఆశా సినిమాలో నటిస్తున్నారు. తమిళ హీరో విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య నటించిన గట్టా కుస్తీ 2 (తెలుగులో మట్టి కుస్తీ 2) పేరుతో విడుదలైంది. ఇందులో ఆమె కుస్తీ క్రీడాకారిణిగా నటించి అలరించారు. 35 ఏళ్లు వచ్చినా పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోని ఐశ్వర్య లక్ష్మీ.. తన వైవాహిక జీవితం, మ్యారేజ్‌పై గతంలోనే తన అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా గట్టా కుస్తీ 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మీ.. మరోసారి పెళ్లి గురించి స్పందించారు.

Recommended For You
'అలా అవమానించారు... నాకు రావాల్సిన సినిమాలు ఆ హీరో చేతికి’
'అలా అవమానించారు... నాకు రావాల్సిన సినిమాలు ఆ హీరో చేతికి’

ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉన్నాయని బలంగా నమ్ముతా. నిజం చెప్పాలంటే ఇప్పటికీ ఇదే నమ్ముతున్నాను. గట్టా కుస్తీ 2 సమయంలో ఒక విషయం నా మనసును ఆలోచింపజేసింది. నాకు కూడా బిడ్డ ఉంటే బాగుండు అనిపిస్తోంది. ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. ఆ పాపతో నాకు కలిగిన అనుబంధం, ఒక తల్లి పాత్ర పోషిస్తున్నప్పుడు పిల్లలతో ఇంతటి బంధాన్ని పంచుకోవడం నా కెరీర్‌లో ఇదే తొలిసారి. అందుచేత నాలోని మాతృత్వపు భావనలు మేల్కొన్నాయి. దాంతో నాకు కూడా ఒక బిడ్డకు తల్లిని కావాలనిపిస్తోంది.

You May Also Like
Nagabandham Day 1 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
Nagabandham Day 1 Collections: నాగబంధం కలెక్షన్స్.. విరాట్ కర్ణ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?

ఈ పరిణామాలతో పెళ్లి గురించి గతంలో నేను అనుకున్న విషయాలన్నీంటినీ ఇప్పుడు మరోసారి పునరాలోచన చేస్తున్నాను. ఒకవేళ నాకు బిడ్డ పుడితే.. ఆ చిన్నారి బాగోగులను బాధ్యతగా పంచుకోవాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తినే కోరుకుంటున్నాను. అలాంటి వ్యక్తి మంచి తండ్రి అనిపించుకుంటాడు. అతను మమ్మల్ని వదిలేసి ఎక్కడికీ వెళ్లిపోకుండా నేను అన్నిరకాల ప్రయత్నాలు చేస్తాను. అయితే మరో వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించే విషయంలో వివాహం లేదా చట్టపరమైన ఒప్పందం వంటివి కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ దిశగా అడుగులు వేసేలా నాలో మార్పులు వస్తున్నాయి. పెళ్లిపై గతంలో కరాకండీగా తేల్చేసిన నేను ఈసారి మాత్రం మారాను అనిపిస్తోంది. నా జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అనుభవాల రీత్యా.. ఒక బిడ్డ కోసం ఎవరితోనైనా చట్టపరమైన ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నా. నా తీరు చూసిన చాలామంది నువ్వు పెళ్లికి ముందే సహజీవనం కోరుకుంటున్నావా అని అడిగారు కూడా. ఆ సమయంలో నాకు కాస్త ఇబ్బందిగా అనిపించిది. అంతేకాకుండా నా మాటలను పూర్తిగా వక్రీకరించారు అని ఐశ్వర్య లక్ష్మీ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి.

Read more about: aishwarya lekshmi movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X