భర్తకు విడాకులు.. ఆ నటుడితో మౌనీరాయ్‌ డేటింగ్? బాయ్‌ఫ్రెండ్ రియాక్షన్ ఇదే!

బాలీవుడ్ నటి మౌనీరాయ్‌ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. తన భర్త విడాకులు ఇవ్వడమే దీనికి కారణం. నాలుగేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ మౌనీరాయ్- సూరజ్ నంబీయార్‌లు విడాకులు తీసుకున్నారు. తొలుత విడాకులు తీసుకోవడం లేదని, ఇదంతా మీడియా ప్రచారమేనని ఖండించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత విడాకులు నిజమేనని బాంబు పేల్చింది. ఇది జరిగిన కొద్దిరోజులకే తన సహ నటుడు అర్జున్ బిజ్లానీతో మౌనీరాయ్ క్లోజ్‌గా ఉండటం కలకలం రేపింది. తాజాగా తమ బంధంపై అర్జున్ స్పందించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’
'ఆ హీరోయిన్‌కి నాకు గొడవలు పెట్టి.. ఉదయ్‌ కిరణ్‌తో అలా మిస్ అయ్యా’

పశ్చిమ బెంగాల్‌కు చెందిన మౌనీ రాయ్ హిందీ బుల్లితెర ఇండస్ట్రీలో పాపులర్ నటి. నాగిన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత వెండితెరపై ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా మౌనీరాయ్ బిజీ అయ్యారు. బ్రహ్మాస్త్ర, కేజీఎఫ్ తదితర సినిమాలలో స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న విశ్వంభరలో ఐటెం సాంగ్ ఛాన్స్ దక్కించుకున్నారు.

Arjun Bijlani Breaks Silence on Dating Rumours with Mouni Roy After Her Divorce Slams Fake Reports

దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబీయార్‌తో ప్రేమలో పడిన మౌనీరాయ్ ఆయనను పెద్దల అంగీకారంతో పెళ్లాడారు. 2022లో గోవాలో వీరి పెళ్లి మలయాళీ, బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని ఇటీవల గాసిప్స్ వైరల్ అయ్యాయి. తన విషయాలతో పాటు కుటుంబం, భర్తకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చే మౌనీరాయ్.. సూరజ్ ప్రస్తావన తీసుకురాకపోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. అటు సూరజ్ కూడా మౌనీతో ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగించడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరింది. చివరికి తాము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు మౌనీరాయ్.

Recommended For You
ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా.. ప్రేమ, పెళ్లిపై అనసూయ ఎమోషనల్
ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా.. ప్రేమ, పెళ్లిపై అనసూయ ఎమోషనల్

సూరజ్‌కు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకే మౌనీరాయ్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. నాగిన్ సీరియల్‌తో తనతో కలిసి నటించిన అర్జున్ బిజ్లానీతో ఆమె డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఓ పార్టీలో అత్యంత క్లోజ్‌గా ఉండటం.. అర్జున్‌కి మౌనీరాయ్ ముద్దుపెడుతున్న పాత వీడియో వైరల్ కావడం ఈ కథనాలకు మరింత బలం చేకూర్చింది. అర్జున్‌తో రిలేషన్‌లో ఉన్న కారణంగానే సూరజ్‌కు మౌనీరాయ్ విడాకులు ఇచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

You May Also Like
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?

దీనిపై అర్జున్ బిజ్లానీ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనీరాయ్‌తో బంధంపై ఆయన సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. 15 ఏళ్లకు పైగా స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఏదో ఒక గాసిప్ పేజీకి హెడ్‌లైన్ అవసరమన్న కారణంతో అకస్మాత్తుగా జంటగా మారిపోరు. కొన్నిసార్లు స్నేహితులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికొకరు అండగా నిలబడతారు. కథనాలను ప్రచురించే ముందు వాస్తవాలను సరిచేసుకోవడం మంచిది, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి అనవసరంగా చొరబడి.. గందరగోళం సృష్టించే తప్పుదోవ పట్టించే కథనాలను వ్యాప్తి చేసే ముందు మీడియా సంస్థలు బాధ్యతతో వ్యవహరించాలి. బాధ్యతాయుతమైన జర్నలిజం విశ్వసనీయతను పెంచుతుంది.. క్లిక్‌బైట్ అలా చేయదని మండిపడ్డారు. అటు అర్జున్ బిజ్లానీ- మౌనీరాయ్‌ల సన్నిహితురాలు క్రిస్టల్ డిసౌజా కూడా వీరి బంధంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఇది పూర్తిగా అర్ధరహితం.. వ్యూస్ కోసం మీరు ఏదైనా చేస్తారా అని మండిపడ్డారు. వీరి ప్రకటనలతోనైనా అర్జున్ బిజ్లానీ- మౌనీరాయ్‌ల బంధంపై వస్తున్న పుకార్లకు చెక్ పడుతుందో లేదో చూడాలి.

Read more about: mouni roy suraj nambiar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X