‘నేనంటే ఇష్టమని నడిరోడ్డుపై.. ఆ సైకో నుంచి అలా తప్పించుకున్నా’

భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారిని దేవుళ్లలా గుడికట్టి పూజిస్తారు అభిమానులు. వారిని ఒకసారి చూస్తే చాలు జన్మ ధన్యం అనుకుంటారు. అయితే కొందరు పిచ్చి అభిమానులు సైకోల్లా మారి హీరో హీరోయిన్లను ప్రేమిస్తున్నామని, పెళ్లి చేసుకుంటామని వేధింపులకు పాల్పడుతుంటారు. సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాస్తుంటారు. మరికొందరు నటీనటుల్ని వెంటాడుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు జరిగిన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

ఆ బాధిత నటి ఎవరో కాదు.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అవంతిక మోహన్. దుబాయ్‌లో పుట్టి పెరిగిన అవంతిక అసలు పేరు ప్రియాంక. చదువు తర్వాత కేరళకు తిరిగొచ్చిన అవంతిక.. 2011లో మిస్ మలబార్ టైటిల్ గెలిచారు. దాంతో ఆమెకు సినిమాలలో ఆఫర్లు వెల్లువెత్తాయి. 2012లో యక్షీ ఫెయిత్‌ఫుల్లీ యువర్స్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మిస్టర్ బీన్, క్రోకడైల్ లవ్ స్టోరీ, అలామరాం, 8: 20, ధీరమ్ తదితర సినిమాలలో నటించారు.

Avanthika Mohan shared a horrifying encounter where an obsessive fan stalked her car

2014లో సుధాకర్ హీరోగా వచ్చిన ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు అవంతిక. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తిరిగి తన మాతృభాషపై ఫోకస్ పెట్టారు ఈ ముద్దగుమ్మ. తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో అవంతిక నటించారు. అయితే సినిమాలలో అంతగా ఆఫర్లు రాకపోవడంతో బుల్లితెరపై అడుగుపెట్టారు. తెలుగు, మళయాళ భాషలలో పలు ధారావాహికలలో నటించారు.

Recommended For You
Lenin Overseas Box Office: ఓవర్సీస్‌లో అదరగొట్టిన లెనిన్.. అఖిల్ అక్కినేని మూవీకి ఎన్ని కోట్లంటే?
Lenin Overseas Box Office: ఓవర్సీస్‌లో అదరగొట్టిన లెనిన్.. అఖిల్ అక్కినేని మూవీకి ఎన్ని కోట్లంటే?

కెరీర్ పీక్స్‌లో ఉండగానే అనిల్ కుమార్ కైంత్‌ను 2017లో పెళ్లాడారు అవంతిక. ఈ దంపతులకు రుద్రాంశ్ సంతానం. 40కి చేరువ అవుతున్నా చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోయే అవంతికా మోహన్‌కు వీరాభిమానులు ఉన్నారు. ఆమె అందానికి చిన్నారుల నుంచి పెద్దల వరకు ఫిదా కావాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఓ 17 ఏళ్ల కుర్రాడు తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అవంతికకు మ్యారేజ్ ప్రపోజల్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పదేపదే పెళ్లి చేసుకోమని ఇన్‌స్టాగ్రామ్‌కు మెసేజ్‌లు వస్తుండటంతో అవంతిక సున్నితంగా మందలించారు. నువ్వు చిన్న పిల్లాడివి, జీవితమంటే ఏంటో నీకు పూర్తిగా తెలియదు. నీకంటే నేను చాలా పెద్దదానిని, మనిద్దరం పెళ్లి చేసుకుంటే నన్ను నీ భార్య అనుకోరు.. నీ తల్లి అనుకుంటారు. అందుచేత బాగా చదువుకోమ్మని వార్నింగ్ ఇచ్చింది.

You May Also Like
ఆయనకి చిన్న పిల్లనే.. గుండెనిండా గుడిగంటలు ప్రభావతి ఎమోషనల్
ఆయనకి చిన్న పిల్లనే.. గుండెనిండా గుడిగంటలు ప్రభావతి ఎమోషనల్

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో అభిమాని వేధింపుల గురించి బయటపెట్టారు అవంతికా మోహన్. ఓ చోట నేను నిలబడి ఉండగా.. ఒక వ్యక్తి మాస్క్‌ వేసుకున్నప్పటికీ నన్ను గుర్తుపట్టి నా ఫోన్ నెంబర్ కావాలని గోల చేశాడు. నేను వెళ్లిపోమ్మని ఎంతచెప్పినా వినిపించుకోలేదు. చివరికి మా స్నేహితురాలు నేను కారులో వెళ్లిపోతుండగా మా కారును వెంబడించాడు. దాంతో జనం బాగా ఉన్న ప్రాంతంలో అతనిని గట్టిగా నిలదీశా. ఇలాగే వెంటపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో అతను వెక్కి వెక్కీ ఏడ్చాడు. మీరంటే నాకు బాగా ఇష్టం.. ఇన్‌స్టాగ్రామ్‌లో రిప్లయ్ ఇవ్వమని అడిగాడు. అతను ఏం చేస్తాడోనని భయపడి సరేనని చెప్పి తప్పించుకున్నా. నా జీవితంలో ఎందరో సైకోలను చూశాను కానీ, అతని మాత్రం భయపెట్టాడు. అభిమాన నటీనటుల పట్ల మర్యాదగా ఉండండి, వారి ప్రైవసిని గౌరవించండి అని అవంతికా మోహన్ కోరారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X