ఆయనకి చిన్న పిల్లనే.. గుండెనిండా గుడిగంటలు ప్రభావతి ఎమోషనల్

స్టార్ మాలో సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతూ, ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకుంటోంది గుండెనిండా గుడిగంటలు సీరియల్. ఈ ధారావాహికలో తన అద్భుత నటనతో ఆకట్టుకుంటున్నారు అనీలా శ్రీకుమార్. బాలుకి తల్లి పాత్రలో.. పెద్ద కొడుకుని మాత్రమే గారాభం చేస్తూ బాలుని మాత్రం నిర్లక్ష్యం చేస్తూ అవమానించే పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. తాజాగా శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి విచ్చేసిన అనీలా శ్రీకుమార్ తన భర్త గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Overseas Box Office: ఓవర్సీస్‌లో అదరగొట్టిన లెనిన్.. అఖిల్ అక్కినేని మూవీకి ఎన్ని కోట్లంటే?
Lenin Overseas Box Office: ఓవర్సీస్‌లో అదరగొట్టిన లెనిన్.. అఖిల్ అక్కినేని మూవీకి ఎన్ని కోట్లంటే?

వారం వారం బుల్లితెర సెలబ్రిటీలతో శ్రీముఖి చేసే సందడి మామూలుగా ఉండదు. వారానికో ప్రత్యేక థీమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దీనిలో భాగంగా ఈ వారం గుండెనిండా గుడిగంటలు టీమ్ అలరించింది. ఈ ధారావాహిక సక్సెస్‌ఫుల్‌గా 700కు పైగా ఎపిసోడ్స్‌ను పూర్తి చేసుకోవడంతో సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ షోకి బాలు- మీనాతో పాటు మొత్తం గుండెనిండా గుడిగంటలు టీమ్ మొత్తం వచ్చి ఆటాపాటలతో అలరించింది. దీనికి సంబంధించి స్టార్ మా వరుస ప్రోమోలను విడుదల చేస్తోంది. లేటెస్ట్ ప్రోమోను పరిశీలిస్తే..

Gundeninda Gudigantalu fame Anila Sreekumar Turns Emotional About Husband on Adivaaram with Star Maa Parivaaram

మీనా అభిమానులు.. ఆమె మాస్క్‌లు పెట్టుకుని స్టేజ్ మీదకి వచ్చారు. నా షోలో ఇప్పటి వరకు ఎవరికి ఫ్యాన్స్ ఇలా మాస్క్‌లు పెట్టుకని రాలేదు. కేవలం మీనా అనే క్యారెక్టర్‌ను అంత ఇష్టపడుతున్నారు కాబట్టి అని శ్రీముఖి మీనాని స్టేజ్ మీదకి పిలిచింది. పూలన్నీ గంపలో ఉంటే ఎంత క్యూట్‌గా కనిపిస్తాయో మీరు కూడా అంత బాగుంటారు కాబట్టి మీకు పూలగంప అని పేరు పెట్టారనిపిస్తుంది. మీనాలోని కళ్లలో మేజిక్ ఉంటుంది.. మీనా అక్కలాంటి ఒక కోడలు అందరి ఇంట్లో ఉండాలని అభిమానులు చెబుతుండగా మీనా పొంగిపోయింది.

Recommended For You
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?
Lenin Day 1 Collections: లెనిన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. అఖిల్ అక్కినేని మూవీకి తొలి రోజు ఎన్ని కోట్లంటే?

మీది, బాలుగారిది కాంబినేషన్ చాలా బాగుందని చెబుతుండగా పక్కనే ఉన్న శ్రీముఖి.. మరి మా ఇద్దరిది ఎలా ఉందని అడగ్గా వీళ్లది పూలగంప, మీది ముళ్లగంప అని ఎక్స్‌ప్రెస్ హరి సెటైర్లు పేలుస్తాడు. నా మీద చూపిస్తున్న అభిమానాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకుంటా ఇలాగే హార్డ్ వర్క్ చేస్తా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కష్టపడతానని మీనా ఎమోషనల్ అయ్యింది. ఆ వెంటనే అనీలా భర్త శ్రీకుమార్ స్టేజ్ మీదకి రావడంతో ఆయనతో కలిసి డ్యాన్స్ చేశారు. మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందని శ్రీముఖి అడగ్గా.. 1995లో నా తొలి సీరియల్‌లోనే కలిశాం, దానికి ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్. నెక్ట్స్ సీరియల్‌కి ఆయనే నన్ను పిలిచి ప్రపోజ్ చేశారని అనీలా తెలిపారు.

You May Also Like
Samantha: అఖిల్ అక్కినేనికి సమంత రిటర్న్ గిఫ్ట్... బంగారం పోస్ట్ వైరల్
Samantha: అఖిల్ అక్కినేనికి సమంత రిటర్న్ గిఫ్ట్... బంగారం పోస్ట్ వైరల్

వీరిద్దరికీ పెళ్లయి 30 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా అనీలా- శ్రీకుమార్‌లతో మరోసారి పెళ్లి వేడుకల్ని నిర్వహించింది శ్రీముఖి. చివరిలో అరుంధతి నక్షత్రం ఎలా చూడాలో బాలు వేలుని పట్టుకుని శ్రీముఖి చూపిస్తుండగా సగం పెళ్లయిపోయిందని ఎక్స్‌ప్రెస్ హరి గోలగోల చేస్తాడు. పెళ్లిరోజు కానుకగా అనీలా- శ్రీకుమార్ దంపతులకు నటరాజు విగ్రహాన్ని బహూకరిస్తుంది శ్రీముఖి. ఆ వెంటనే భర్త కాళ్లకు మొక్కి డ్యాన్స్ చేస్తుంది అనీలా. నా తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారో అలాగే ఆయన నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకున్నారని అనీలా శ్రీకుమార్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: gundeninda gudigantalu balu meena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X