స్టేజ్‌పై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే.. హైదరాబాద్ నా కర్మభూమి అంటూ..

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీంతో మూవీ మేకర్స్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో హీరో అఖిల్, నిర్మాత నాగార్జున, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన సంఘటన మాత్రం హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ కావడం. స్టేజ్‌పై మాట్లాడుతుండగా ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడం. ఇంతకీ ఏం జరిగిందంటే?

Also Read
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

వరుస ఫ్లాపుల తర్వాత..
భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ, ఆమె నటించిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోవడం లేదు. రవితేజ సరసన నటించిన 'మిస్టర్ బచ్చన్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్, రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలు కూడా కమర్షియల్‌గా పెద్ద విజయాలు సాధించలేకపోయాయి. దీంతో సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆమెపై "ఐరన్ లెగ్" అనే విమర్శలు కూడా వినిపించాయి.

Bhagyashri Borse Breaks Down at Lenin Success Meet
Recommended For You
స్టార్ హీరోల సినిమాలపై మాధవిలత ఫైర్.. హీరోయిన్లు కేవలం దానికోసమేనంటూ..
స్టార్ హీరోల సినిమాలపై మాధవిలత ఫైర్.. హీరోయిన్లు కేవలం దానికోసమేనంటూ..

అయితే, వరుస ఫ్లాపులు వచ్చినా దర్శకులు, నిర్మాతలు మాత్రం ఆమెపై నమ్మకం కోల్పోలేదు. వరుస అవకాశాలు రావడం కొనసాగింది. అదే సమయంలో అభిమానులు కూడా సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు అందించారు. అలా అక్కినేని అఖిల్ 'లెనిన్ ' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ 'భారతి' అనే పాత్రలో కనిపించారు. ఇది కేవలం గ్లామర్ పాత్ర కాకుండా, కథలో కీలక భావోద్వేగ సన్నివేశాలను కూడా బాగా పండించారు. గ్రామీణ యువతిగా ఆమె చూపించిన ఎక్స్ర్పెషన్స్, అఖిల్‌తో కెమిస్ట్రీ, భావోద్వేగ సన్నివేశాల్లో నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా అఖిల్‌కు మాత్రమే కాకుండా భాగ్యశ్రీ కెరీర్‌కూ టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశముంది.

You May Also Like
ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్
ఆ సమస్యతో ఇబ్బంది పడుతున్నా.. యాంకర్ రష్మి ఎమోషనల్

స్టేజ్‌పై భావోద్వేగం ఎందుకు?
సక్సెస్ మీట్‌లో మాట్లాడేందుకు మైక్ తీసుకున్న భాగ్యశ్రీ మొదట సాధారణంగానే తన మాటలను ప్రారంభించారు. అఖిల్‌కు, నిర్మాత నాగార్జునకు, దర్శకుడికి, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత అభిమానుల గురించి మాట్లాడుతుండగానే ఆమె గొంతు బిగుసుకుపోయింది. 'నా అభిమానులు సోషల్ మీడియాలో నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. నా సినిమాలకు సంబంధించిన రీల్స్ చేశారు. నన్ను నమ్మారు. వారి ప్రేమ వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను'అని చెప్పింది. మాట పూర్తయ్యేలోపే కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్దిసేపు మాట్లాడలేక ఆగిపోయింది భాగ్యశ్రీ. కాసేపు తరువాత.. "హైదరాబాద్ నా కర్మభూమి. నా సినీ ప్రయాణంలో చివరి సినిమా కూడా టాలీవుడ్‌లోనే చేయాలని కోరుకుంటున్నాను." అంటూ స్టేజ్ పైనే ఏడ్చేసింది.

ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..
ఎన్టీఆర్‌కు పోటీగా ధనుష్? ఒకే బ్యాక్‌డ్రాప్‌తో రెండు సినిమాలు..

ఈ కార్యక్రమంలో నాగార్జున భాగ్యశ్రీ నటనను ప్రత్యేకంగా అభినందించారు. 'భారతి' పాత్రను ఆమె చాలా సహజంగా పోషించారని, సినిమాలో భావోద్వేగాలకు ఆమె నటన ప్రధాన బలంగా నిలిచిందని ప్రశంసించారు. కెరీర్ ప్రారంభం నుంచి విమర్శలను ఎదుర్కొన్న భాగ్యశ్రీకి ఇలాంటి ప్రశంసలు రావడం కూడా ఆమె భావోద్వేగానికి ఒక కారణంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. 'లెనిన్'కు వస్తున్న స్పందనను బట్టి చూస్తే భాగ్యశ్రీ బోర్సేకు ఇకపై మరిన్ని పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యశ్రీ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X