Samantha పాపం తమన్నా.. డీప్లవ్లో సడెన్ హార్ట్ బ్రేక్.. ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చిన సమంత!
ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ ఉంటుంది. అలా అని ఒకరినొకరు జలసీ పడేంతా కాదనుకోండి. స్టార్ హీరోయిన్స్ అయినా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు. హీరోయిన్ సమంత, మరో స్టార్ హీరోయిన్ తమన్నా ఇద్దరు మంచి స్నేహితులే. మరి వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమన్నా తన హార్ట్ బ్రేక్ అయిందంటూ చెప్పడం.. సమంత ఎవరు ఆ వ్యక్తి అంటూ వార్నింగ్ ఇవ్వడం.. ఇలా ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అసలు తమన్నాను అంతలా బాధపెట్టిన వ్యక్తి ఎవరు.. సమంత ఎవరికి వార్నింగ్ ఇచ్చింది.. అనే వివరాలు ఈస్టోరీలో చూసేద్దాం పదండి.
వీడియో నెట్టింట వైరల్ : హీరోయిన్ సమంత.. ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటికీ తాను నంబర్ వన్ అని చెప్పవచ్చు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత తన మయోసైటిస్ వ్యాధిన పడింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే సమంత.. హీరోయిన్ తమన్నాతో కలిసి ముచ్చటించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సామ్ జామ్ షోలో తమన్నా : సమంత గతంలో ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే షో చేసిన సంగతి తెలిసిందే. ఈ షోకు మంచి ఆదరణ కూడా వచ్చింది. చాలా మంది సెలబ్రేటీలు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి మాధ్యమాల్లో ఈ వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. అలా సమంత హోస్టుగా చేసిన ఈ కార్యక్రమంలో తమన్నా కూడా పాల్గొంది. సమంతతో కలిసి సందడి చేసింది. ఎన్నో ఆసక్తికరవ్యాఖ్యలు చేసింది.
సమంత వార్నింగ్ : అందులో తమన్నా తన హార్ట్ బ్రేక్ గురించి చెప్పుకువచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అందులో తమన్నా పోయమ్స్ రాస్తుందని తెలుసుకుంటుంది సమంత. దీంతో సామ్ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎప్పుడు రాస్తావ్ అని.. దానికి తమన్నా.. నా హార్ట్ బ్రేక్ అయినప్పుడు రాస్తాను అంటూ చెప్పుకువస్తుంది. దీంతో సామ్ ఎవరు నీ హార్ట్ బ్రేక్ చేసింది చెప్పు అంటూ వార్నింగ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. దీంతో తమన్నాతో పాటు అక్కడ ఉన్న వారంతా నవ్వుతుంటారు.
OTTలోకి మరో సూపర్ హిట్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తమన్నా హార్ట్ బ్రేక్ : సమంత అడిగిన ప్రశ్నకు తమన్నా మాట్లాడుతూ... ఎప్పుడైతే మన హృదయం ముక్కలవుతుందో అప్పుడు మనం కవిత్వాలు రాస్తాం. మన జీవితంలో అలాంటిది ఏమైనా జరిగినప్పుడు మనం కవిగా మారుపోతుంటాం. ఈ సమాజంలో ఎదుటివారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉన్నారు అంటూ చెప్పుకువస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్రూన తిరుగుతుంది. ఇది చూసిన చాలా మంది ఎవరు ఆ వ్యక్తి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇద్దరూ ఫుల్ బిజీ : ఇక సమంత విషయానికి వస్తే.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇటీవల ఓ పాడ్ కాస్ట్ మొదలు పెట్టింది. త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తమన్నా.. తన ప్రియుడు విజయ్ వర్మతో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయింది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరు ఒక్కటు కానున్నారని వార్తలు వస్తున్నాయి. వాటితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











