భర్త‌కు ఎఫైర్లు ఉంటే తప్పేంటి.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

చిత్ర పరిశ్రమలో హీరోల ఎఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికాకముందు పెళ్లియిన తర్వాత హీరోయిన్లతో ఎఫైర్లు సాగించిన వారు ఎందరో ఉన్నారు. భర్త బండారాలు తెలిసి విడాకులు ఇచ్చిన వారు ఉన్నారు.. పరువు కోసం అలాగే సంసారాలను నెట్టుకొస్తున్న వారు ఉన్నారు. సెలబ్రిటీలే కాదు మామూలు మగాళ్లు కూడా ఎఫైర్లు పెట్టుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మగాళ్ల ఎఫైర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?
జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజకు రెమ్యునరేషన్ ఎంత? ఒక్క ఎపిసోడ్‌‌కు పారితోషికం ఎన్ని లక్షలంటే?

జీవిత రాజశేఖర్ అసలు పేరు పద్మ. కర్నూలు జిల్లా శ్రీశైలంకు చెందిన జీవితనకు అక్క, అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. జీవిత తాతగారు మాజీ సీఎం, మహానటుడు నందమూరి తారక రామారావు దగ్గర అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడు టీ రాజేందర్ తెరకెక్కించిన ఉరవై కార్తకిలి (1984) అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. తొలి సినిమాకే తన నటనతో ఆకట్టుకున్న జీవితకు వరుసపెట్టి అవకాశాలు వెల్లువెత్తాయి. 1980 దశకంలో కోలీవుడ్‌లో అగ్రనటిగా జీవిత వెలుగొందారు. తలంబ్రాలు మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జీవిత.. డామిట్ కథ అడ్డం తిరిగింది, ప్రజాస్వామ్యం, ఆహుతి, స్టేషన్ మాస్టర్, తిరగబడ్డ తెలుగుబిడ్డ, సిరిపురం చిన్నోడు, మిస్టర్ హీరో, జానకి రాముడు, అంకుశం, మగాడు తదితర సినిమాలలో నటించి ఇక్కడా మంచి పేరు తెచ్చుకున్నారు.

Jeevitha Rajasekhar sparked debate for comments made regarding extramarital affairs and marriage

ఈ దశలో తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, మగాడు తదితర సినిమాలలో తనతో కలిసి నటించిన యాంగ్రి యంగ్‌మెన్ డాక్టర్ రాజశేఖర్‌తో ప్రేమలో పడిన జీవిత.. ఆయనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శివాత్మిక, శివానీ రాజశేఖర్ సంతానం. భర్త, కుటుంబం కోసం జీవిత తన సినీ కెరీర్‌ను త్యాగం చేశారు. అయితే దర్శకురాలిగా, నిర్మాతగా జీవిత సత్తాచాటారు. శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ తదితర సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. తన భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలుస్తూ వస్తున్నారు జీవిత.

Recommended For You
1000 కోట్ల ఆస్తులతో నటి రేఖ.. మరణాంతరం సంపద ఎవరికంటే?
1000 కోట్ల ఆస్తులతో నటి రేఖ.. మరణాంతరం సంపద ఎవరికంటే?

మనసులో ఏమున్నా సరే నిర్మొహమాటంగా చెప్పడం, ముక్కుసూటితనంతో జీవిత పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అయినప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉండేవారు. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టను, బాగా మొండి. నవభారతం అనే సినిమా షూటింగ్ కోసం ఒంగోలుకు వెళ్లాం. షాట్ ముగించుకుని హోటల్‌కి వెళ్తే రూమ్‌లో ఎవరో అమ్మాయి ఉండటం చూసి పరిగెత్తుకుంటూ ఆయన నా రూమ్‌కి వచ్చి జరిగింది చెప్పారు. ఫ్యాన్ అని చెప్పి వచ్చింది.. ఇంటికి వెళ్లమంటే వెళ్లడం లేదని చెబితే నేనే పంపించానని జీవిత తెలిపారు.

You May Also Like
ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా.. ప్రేమ, పెళ్లిపై అనసూయ ఎమోషనల్
ఆ ఇద్దరి మధ్య నలిగిపోయా.. ప్రేమ, పెళ్లిపై అనసూయ ఎమోషనల్

ఆయన నా దగ్గర ఏ విషయం దాచరు.. చాలామంది అమ్మాయిలు బాగుందని చెప్పినా ఆ అమ్మాయే కావాలని పట్టుబట్టలేదు. ఇప్పట్లో ఎవరూ శ్రీరామచంద్రుడు ఉండరు, నేను చేసే షోల లోనూ ఇదే చెబుతా. ఒకమ్మాయితో పబ్లిక్‌గా తిరిగేసి, నేను ఉంచుకున్నాను.. నాకు ఎఫైర్ ఉందని పబ్లిక్‌గా చెప్పినవాడితో ఉండాల్సిన అవసరం లేదు. కానీ అట్రాక్షన్‌తో నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రసీ మెయింటైన్ చేసి ఎఫైర్ పెట్టుకున్నాడంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే నీ దగ్గర ఈ విషయం గోప్యంగా ఉంచాడు అని జీవిత అన్నారు.

'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’
'నా భర్తకు 50 మందితో అఫైర్.. అయినా వదిలిపెట్టను’

ఇప్పుడు మనం ఒకే హోటల్ దగ్గరకి వెళ్లి భోజనం చేయడం లేదు కదా? ఒకే బట్టలు వేసుకోవడం లేదు కదా? కొత్తగా ఏదో చేద్దామని నీ దగ్గర దాచి వెళ్లాడు. నీకు తర్వాత ఏదో తెలిసింది. నువ్వు దాని గురించి పెద్ద ఇష్యూ చేయొద్దు.. వదిలేసేయ్. కానీ ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఇంకో ఫ్యామిలీని పెట్టాడు, నిన్ను వదిలేశాడు, నీ పిల్లల్ని పట్టించుకోవడం లేదు, నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చేశాడంటే అలాంటి వాడితో ఉండాల్సిన అవసరమే లేదని జీవిత తేల్చేశారు.

10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం
10 వేలు ఇస్తా బయటికి గెంటేయండి... బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై జడ్జి ఆగ్రహం

భర్త చేసినట్లు భార్య కూడా అలాగే చేస్తే మొగుడు చచ్చినట్లు ఒప్పుకోవాల్సిందే. నా దగ్గరికి ఇలాంటి కేసులు కూడా చాలానే వచ్చాయి. నువ్వు ఇష్టమొచ్చినట్లు తిరుగుతావు, నీ పెళ్లాం మాట్లాడితే తప్పా? నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను క్షమించాలి.. అదే నీ భార్య చేస్తే నువ్వు కూడా నీ వైఫ్‌ని క్షమించాలి. గతంలో మగాడు బయటికి వెళ్లేవాడు.. సంపాదించేవాడు అనేవారు. సంపాదించడం ఎంత పెద్ద పనో.. ఇంట్లో ఉండి చక్కబెట్టడం ఇంకా పెద్ద పని. ఈరోజున ఆడోళ్లు కూడా సంపాదిస్తున్నారని జీవిత పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: jeevitha rajasekhar rajasekhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X