దీపిక పదుకొణె‌ను నేనే వదిలేశా.. రెండేళ్లు డేటింగ్, బ్రేకప్ కారణం అదే!

భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటుల మధ్య డేటింగ్, బ్రేకప్స్ వంటివి జరిగాయి. ఎన్నో ఎఫైర్స్ జరిగిన తర్వాత వేరెవరినో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కొందరైతే ప్రియసి, ప్రియులను మరిచిపోలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ నటుడు ముజమ్మిల్ ఇబ్రహీం. ఇప్పటి అగ్రనటి దీపికా పదుకొణెతో ఆయన ప్రేమాయణం, బ్రేకప్ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముజమ్మిల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అసలు దీపికకు ముజమ్మిల్ మధ్య ఏం జరిగింది? వీరిద్దరూ ఎందుకు విడిపోయారు? ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
Lenin Day 2 Collections:లెనిన్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. అఖిల్ సినిమాకు ఎన్ని కోట్లంటే?

శ్రీనగర్‌లో పుట్టి పెరిగిన ముజమ్మిల్ ఇబ్రహీం తొలుత మోడల్‌గా ఎంట్రీ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందుస్తాన్ టైమ్స్ నిర్వహించిన బెస్ట్ మోడల్ అవార్డ్‌ను వరుసగా మూడేళ్లు అందుకున్నారు ముజమ్మిల్. దీనితో పాటు మోస్ట్ గ్లామరస్ మేల్ మోడల్ అవార్డ్, మోస్ట్ స్టైలీష్ మేల్ మోడల్ అవార్డును అందుకున్నారు. ఈ క్రమంలో సినీరంగంలో ఆయనకు అవకాశాలు వచ్చాయి. 2007లో ధోఖ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత హోం ఓకే ప్లీజెస్, విల్ యూ మ్యారీ మీ, స్పెషల్ ఓప్స్, లవ్ అండ్ వార్ తదితర సినిమాలలో ఆయన నటించారు. సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న దశలో ఇబ్రహీం కెరీర్‌లో అర్ధాంతరంగా ముగిసిపోయింది.

Muzammil Ibrahim Opens Up on Dating and breakup with Deepika Padukone

రణ్‌వీర్ సింగ్‌తో పెళ్లికి ముందు పలువురు స్టార్ హీరోలతో దీపిక పదుకొణె డేటింగ్ చేశారు. వారిలో ముజమ్మిల్ కూడా ఒకరు. అప్పట్లో టాప్ మోడల్‌గా, హీరోగా ముజమ్మిల్ ఇబ్రహీం ఎదుగుతున్నారు. వీరి మధ్య ప్రేమ చిగురించి రెండేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు. కానీ ముజమ్మిల్ - దీపికా పదుకొణేల మధ్య బ్రేకప్‌కి దారి తీసిన కారణాలు ఎవరికీ తెలియదు. ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో ముజమ్మిల్ ఆ పాత విషయాలపై మనసులోని మాటలను బయటపెట్టారు.

Recommended For You
జానకమ్మ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?.. గుండెను తాకే రియల్ లైఫ్ స్టోరీ!
జానకమ్మ ప్రేమకథలో ఇన్ని ట్విస్టులా?.. గుండెను తాకే రియల్ లైఫ్ స్టోరీ!

ముంబైకి వచ్చిన తొలినాళ్లలో దీపిక మోడల్‌గా పనిచేసేది. ఆ సమయంలోనే మా మధ్య ప్రేమ చిగురించింది. డబ్బులు లేకపోవడంతో రిక్షాలోనే డేటింగ్‌కు వెళ్లే వాళ్లం.. అలా రెండేళ్లపాటు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. మోడల్‌గా నిలదొక్కుకుంటున్న సమయంలోనే కారు కొన్నాను. దానికి దీపిక ఎంతగానో సంతోషించింది. కానీ నాటి నుంచి మళ్లీ రిక్షాలో డేట్‌కు వెళ్లలేదు. తొలినాళ్లలో మా దగ్గర డబ్బు లేకపోయినా సంతోషంగా ఉండేవాళ్లమని చెప్పారు. అప్పుడు నేను స్టార్ మోడల్, హీరో. కానీ దీపిక మాత్రం సాధారణ మోడల్‌. ఆమెను నేనే వదిలేశాను. ఆమెను వదులుకున్నందుకు నాకు ఎలాంటి బాధలేదు. పెళ్లికి ముందు వరకు నాతో టచ్‌లో ఉండేది, ఫ్రెండ్స్‌లాగే మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు నాతో మాట్లాడటం లేదు.. కానీ దీపిక మంచి ప్రతిభావంతురాలు. ఇప్పుడు ఆమె సూపర్‌స్టార్ అయ్యింది, పరిస్ధితులు చాలా మారాయి. నన్ను ఎవ్వరూ గుర్తుపట్టడం లేదు.. ఆమెను అందరూ గుర్తించి గౌరవిస్తున్నారని వ్యాఖ్యానించారు ముజమ్మిల్.

You May Also Like
వారణాసిలో నందమూరి వారసుడు.. రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్..
వారణాసిలో నందమూరి వారసుడు.. రాజమౌళి ప్లానింగ్ వేరే లెవల్..

ఇక ముజమ్మిల్‌తో బ్రేకప్ తర్వాత దీపిక పదుకొణే వరుస హిట్స్‌తో సూపర్‌స్టార్‌గా, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. నటుడు రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమలో పడిన దీపిక పదుకొణె ఆయనతో ఆరేళ్లపాటు డేటింగ్ చేశారు. 2018 అక్టోబర్‌లో ఇటలీలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. కొంకణి హిందూ, సిక్కు సాంప్రదాయాల ప్రకారం రణ్‌వీర్ సింగ్- దీపిక పదుకొణెల పెళ్లి జరిగింది. 2024 సెప్టెంబర్ 8న దీపిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.. ఆమెకు దువా అని పేరు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను రెండోసారి తల్లిని కాబోతున్నట్లు దీపికా పదుకొణె ప్రకటించారు. ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతానికి సినిమాలకు ఆమె బ్రేక్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X