యువ హీరోతో మమితా బైజు బహిరంగంగా రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రేమలు హీరోయిన్!
ప్రేమలు సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా దక్షిణాది అన్ని రాష్ట్రాల్లోను ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో రీనూ పాత్రలో నటించిన మమితా బైజు తెలుగు వారందరికి చేరువైన విషయం తెలిసిందే. ప్రేమలు సినిమా తర్వాత మమితాకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ కూడా లభించింది. అలాంటి యువ హీరోయిన్ తాజాగా ఓ ఫంక్షన్‌లో అముల్ డేవిస్‌తో రొమాంటిక్ వ్యవహరిస్తూ ఉన్న వీడియో దొరికిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
మమితా బైజు 2017 సంవత్సరంలోనే సార్వోపారి పలక్కారన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 15 సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు లభించలేదు. కానీ ప్రేమమ్ సినిమా మాత్రం ఆమెకు తమిళ, కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఫాలోయింగ్ వచ్చేలా చేసింది. దాంతో ఈ అమ్మడు హాట్ బేబీగా మాిరంది.

ప్రేమలు సినిమా తర్వాత మమితా బైజుకు అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగింది. ఆమెకు భారీగా తెలుగు, తమిళ భాషల నుంచి ఆఫర్లు వెళ్లాయి. గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్ పరంగా కూడా ఈ బేబీ అందర్నీ ఆకట్టుకోవడంతో నిర్మాతలు, దర్శకులు ఆమె కోసం ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెను విశేషంగా ఆదరిస్తున్నారు.

Ghilli Collectionsబాక్సాఫీస్ వద్ద గిల్లీ శివతాండవం..సౌత్ ఇండస్ట్రీలో విజయ్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు..
సంగీత్ ప్రతాప్, మమితా బైజూ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే వారిద్దరిపై నెటిజన్లు చిలిపిగా కామెంట్స్ పెడుతున్నారు. సచిన్‌ను యూకేకు పంపించి.. అమూల్‌ను లైన్‌లో పెట్టావా? అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రేమలు సినిమాకు తగినట్టుగానే ఆ కామెంట్ ఉండటంతో నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
ఇదిలా ఉండగా, ప్రేమలు సినిమా తర్వాత మమితా బైజు నటించిన రెబల్ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేదు. జీవీ ప్రకాశ్‌తో కలిసి ఆమె నటించింది. ఆ సినిమాకు తమిళం, కేరళలో ప్రేక్షకాదరణ పొందకపోవడంతో ఈ అమ్మడికి షాక్ తగిలింది. అయితే రానున్న సినిమాలపైనే ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నది.


Click it and Unblock the Notifications











