X
ఏజెంట్ భైరవ
Action | Romance | 07 Jul 2017 | U |
Telugu

ఏజెంట్ భైరవ స్టోరీ

ఏజెంట్ భైరవ సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, కీర్తి సురేష్, జగపతి బాబు, సతీష్, వై జి మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్ బాలాజీ, ఆపర్ణ వినోద్, పాప్రీ గోష్, హరిష్ ఉత్తమన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరతన్ వహించారు మరియు నిర్మాత బెల్లం రామకృష్ణరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణ్ అందించారు. 

కథ

సమాజంలో సమస్యలనే తన సినిమాలకు కథలుగా ఎంచుకునే విజయ్... ఈ సారి ప్రైవేటు మెడికల్ కాలేజీల భాగోతాన్ని తన చిత్ర మూల కథగా ఎంచుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పుట్టగొడుల్లా పుట్టుకొచ్చిన అక్రమ మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. రౌడీలు, గుండాలు, రాజకీయనాయకులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో మెడికల్ కాలేజీలు పెట్టి సామాన్యులను ఎలా దోచుకుంటున్నారు? కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా వెలసిన ఈ కాలేజీలు సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న వైనాన్ని టార్గెట్ చేస్తూ సినిమా సాగింది. పిడకల కోటయ్య అలియాస్ పి.కె (జగపతి బాబు) వైజాగ్‌లో కసాయి కొట్టునడుపుతూ మాంసం విక్రయించే స్థాయి నుండి... రౌడీగా, గుండాగా, ఆపై పారిశ్రామిక వేత్తగా, ప్రభుత్వాన్ని శాశించే స్థాయికి ఎదుగుతాడు. ఎరైనా తనకు అడ్డొస్తే వాళ్ల అడ్డు తప్పించుకోవడానికి వాళ్లను చంపడానికి కూడా వెనకాడని క్రూరుడు. సమాజంలో వైట్ కాలర్ పెద్ద మనిషిలా చెలామని అవుతూ తనకు ఎదురొచ్చిన వారిని అనుచరుడైన గంగిరెడ్డితో చంపిస్తుంటాడు. విద్యా సంస్థలు స్థాపించి సమాజంలో పెద్దమనిషిలా చెలామని అవుతున్న పికె.... తన మెడికల్ కాలేజీని కాపాడుకోవడానికి తనిఖీలకు వచ్చిన అధికారులకు తన కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి మాన ప్రాణాలను ఎరగా విసురుతాడు. ఆపై ఆమెను హత్య చేయిస్తాడు. అసలు.... ఈ పిడకల కోటయ్యకు, ఏజెంట్ భైరవ(విజయ్), మాధవి లత(కీర్తి సురేష్)కి సంబంధం ఏమిటి? పిడకల కోటయ్య అక్రమాలను వీరు ఎలా ఆటకట్టించారు అనేది తర్వాతి కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+