X
అల్లుడుశీను
Action | 25 Jun 2014 | A |
Telugu

అల్లుడుశీను స్టోరీ


అల్లుడుశీను సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు, వెన్నెల కిశోర్, వేణు, ఫణి, ఫిష్ వెంకట్, పృధ్వి, జెన్ని, ప్రదీప్ రావత్, రవిబాబు, భరత్, ప్రవీణ్, ఆనంద్ భారతి, గుండు సుదర్శన్, అనంత్, అమిత్, నవీన్ తదితరులు ప్రాధాన పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వి వి వినాయక్ నిర్వహించారు, నిర్మాత:బెల్లంకొండ సురేశ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సర్వాలు సమకుర్చారు.

కథ

నల్గొండలో ఉండే అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో కలిసి అప్పులు పాలై , పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాడు. అక్కడ శ్రీనుకి తన మామ పోలికలతోనే...సెటిల్ మెంట్స్ చేస్తూ బ్రతికే లోకల్ డాన్ భాయ్(ఇంకో ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. ఇది గమనించిన అల్లుడు శ్రీను...దాన్ని అడ్వాంటేజి గా తీసుకుని... ఓ ట్రిక్ ప్లే చేస్తాడు. తన మామ గెటప్ మార్చి..భాయ్ గా తయారు చేసి, అతన్ని అడ్డం పెట్టి దందా చేస్తూ డబ్బు సంపాదించటం మొదలెడతాడు.

 ఈ లోగా భాయ్ కూతురు అంజలి(సమంత) కూడా సినిమాటెక్ గా శ్రీను తో ప్రేమలో పడిపోతుంది. ఇదిలా ఉంటే ...తన గెటప్ తో ఛీట్ చేస్తున్నారనే విషయం భాయ్ కి తెలిసిపోతుంది. తన లాగే ఉన్న నరసింహాన్ని, శ్రీను ని చంపేయటానికి ప్రయత్నం చేస్తాడు. అంతేకాకుండా తన కూతురుకు తన బిజినెస్ పార్టనర్(ప్రదీప్ రావత్)కొడుక్కి ఇచ్చి షార్జాలో వివాహం చేయాలని నిర్ణయిస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీను ఏం చేసాడు. భాయ్ కి ఎలా బుద్ది చెప్పాడు. అసలు భాయ్ కి, నరసింహా కు ఉన్న సంభందం ఏంటి... అంజలిని ఎలా సొంతం చేసుకున్నాడు...డింపుల్ గా ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+