X
అ!
Drama | 16 Feb 2018 | U/A |
Telugu

అ! స్టోరీ

అ! సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, రవి తేజ నిత్యామేనన్, కాజల్ అగర్వాల్, శ్రీనివాస అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్, హరి తేజ, దేవదర్శిణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ వర్మ వహించారు మరియు నిర్మాతలు నాని, ప్రశాంతి తిపిర్నెని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రాబిన్ మార్క్ అందించారు.

కథ

బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురైన కాళి (కాజల్ అగర్వాల్) మానసిక క్షోభకు గురవుతుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతుంది. తన జీవిత ప్రయాణంలో అనేక వ్యక్తులతో ట్రావెల్ అవుతుంది. సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అవుతుంది. అలా మానసిక క్షోభకు గురైన కాజల్ జీవితానికి ముగింపు ఏమిటనేది అ! చిత్ర కథ. అ! మూవీ కథలో చెఫ్ (ప్రియదర్శి), హోటల్ యజమాని (ప్రగతి), హోటల్‌లో పనిచేసే బేరర్ (రెజీనా కసండ్రా), హోటల్‌కు వచ్చిన పిల్లతో ఛాలెంజ్‌కు దిగిన మెజిషియన్ (మురళీశర్మ), టైమ్ మిషిన్ తయారు చేసి తల్లిదండ్రులను కలుసుకోవాలనే సైంటిస్టు (అవసరాల శ్రీనివాస్), లైంగిక వేధింపులకు గురై పురుషులంటే అసహ్యభావం పెంచుకొన్న ఇషా రెబ్బా మానసిక వైద్యురాలు కృష్ణవేణి (నిత్యమీనన్‌)తో ప్రేమలో పడటం ఇలాంటి క్యారక్లర్లు కథలో భాగమవుతాయి. ఆ రెస్టారెంట్‌లో జరిగిన సన్నివేశాలు కాజల్ అగర్వాల్ జీవితానికి ఎలా ముడిపడ్డాయి? అనేది తెర మీద పాత్రలు చేసే మ్యాజిక్ అ! చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+