భలే దోంగలు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తరుణ్, ఇలియానా, జగపతిబాబు, ఛార్మీ, సునీల్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సుధ, చంద్రమోహన్, సనా, నరసింహరావు, మల్లిఖార్జునరావు, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్కీన్ ప్లే ,దర్శకత్వం :విజయభాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత శాఖమూరి పాండు రంగారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధాకృష్ణన్ స్వరాలు సమకుర్చారు.
కథ
రాము(తరుణ్), జ్యోతి(ఇలియానా) మిడిల్ క్లాసులో పుట్టి ఇమడలేక తాము ఉన్నతంగా ఊహించే కెరీర్(రాము వ్యాపారం చేసి కోటీశ్వరుడవ్వాలని...జ్యోతి మిస్ ఇండియా అవ్వాలని ఆశ)కోసం వేర్వేరుగా హైదరాబాద్ వస్తారు. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ ఒక చోటకు చేరుతారు. కాని తమ కలలు కలిసిరాకపోవటంతో తప్పని స్థితిలో దొంగతనాలు ప్రారంభింస్తారు. మొదట సరదాగా, తరువాత అలవాటుగా అవి మారి వారికి పాపులారిటీనే కాక ఎన్నో చిక్కులు ఎదుర్కుంటారు. అంతేగాక సిటిలో ఉన్న మాఫియా లార్డ్(ప్రదీప్ రావత్),డి.సి.పి.యుగంధర్(జగపతిబాబు)ల మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ గా మారుతారు. వారి నుండి ఈ జంట ఎలా తప్పించుకున్నారు అనేది మిగతా కథ.