బ్రోచేవారెవరురా సినిమా కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ విష్ణు, నివేద థామస్, నివేథ పెతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రయదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వివేక్ ఆత్రేయ వహించారు మరియు నిర్మాతలు విజయ్ కుమార్ మణ్యం, వివేక్ సాగర్ కలిసి సంయుక్తంగా నిర్మించారు.
కథ
రాహుల్ (శ్రీ విష్ణు), రాంబాబు ( రాహుల్ రామకృష్ణ), రాకేష్ (ప్రియదర్శి) ఒకే కాలేజీలో చదివే ప్రాణ స్నేహితులు RRR ఫేమస్. చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఇలాంటి లక్షణాలు ఉన్న మిత్ర (నివేదా)తో స్నేహం పెరుగుతుంది. మిత్రాకు తండ్రి అంటే అసలే ఇష్టం ఉండదు. ఈ క్రమంలో మిత్రాకు ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు మిత్రాను కిడ్నాప్ చేసినట్టు డ్రామా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక విశాల్ (సత్య దేవ్) సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించాలని కష్టాలు పడుతుంటాడు. షాలిని అనే హీరోయిన్‌కు కథ చెప్పి దర్శకుడిగా మారాలనుకొంటాడు. ఆ క్రమంలో వారు యాక్సిడెంట్‌కు గురవుతారు. మిత్రా కిడ్నాప్ డ్రామాతో రాహుల్; రాంబాబు, రాకేష్ జీవితంలో ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకొన్నాయి. విశాల్, శాలిని యాక్సిడెంట్‌కు కారణమేమిటి? మిత్రాకు ఎదురైన సమస్య ఏమిటి? దానికి RRR ఎలాంటి పరిష్కారం చూపారు? ఈ సినిమా కథలో రెండు వేర్వేరు సంఘటనలకు లింక్ ఏమిటి? చివరకు రెండు గ్రూపుల సమస్యలకు ఏ విధంగా ఉపశమనం లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే బ్రోచేవారెవరురా సినిమా కథ.