X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ 2022 డిజాస్టర్స్.. ఇప్పటికే ఈ లిస్ట్ లోకి ఇన్ని సినిమాలా..!

Author Administrator | Published: Thursday, May 5, 2022, 01:09 PM [IST]

జనవరి నుంచే టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలు పలకరించాయి. అందులో కొన్ని హిట్టైయి నిర్మాతలకు లాబాలను తీసుకొస్తే.. మరికొన్ని ఎపుడు విడుదలై పత్తా లేకుండా పోయాయి. మొత్తంగా నాలుగు నెలల కాలంలో టాలీవుడ్‌‌లో హిట్స్ కన్నా డిజాస్టర్స్ ఎక్కువ వున్నాయి.


cover image
ఇందువదన
1

2022 జనవరి 1న థియేటర్స్‌లో విడుదలైన చిత్రం ‘ఇందువదన’.ఈ చిత్రం రిలీజైన సంగతి కూడా చాలా మందికి తెలియదు... బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది

 

1945
2

జనవరి 7న విడుదలైన 1945  సినిమాను చూసిన ప్రేక్షకులు.. క్లైమాక్స్ లేని సినిమా ఏంటంటూ థియేటర్స్ నుంచి బయటికి వస్తూ ఆడియన్స్ తిట్టుకున్నారు.

సూపర్ మచ్చి
3

సూపర్ మచ్చి సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై సోదిలో లేకుండా పోయింది. పైగా మెగా హీరోలెవరు ఈ సినిమాను కనీసం ప్రమోట్ కూడా చేయలేదు. 

గుడ్ లక్ సఖి
4

 మహానటి కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ జనవరి 28న విడుదలైంది. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు.  బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది

 

ఖిలాడి
5

రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమా ఖిలాడి, ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ ఊహించినంతగా రాలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది

 

మళ్లీ మొదలైంది
6

మళ్లీ మొదలైంది: సుమంత్ హీరోగా విడాకుల తర్వాత జీవితం అనే కాన్సెప్టుతో వచ్చిన సినిమా మళ్లీ మొదలైంది. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 11న నేరుగా జీ5లో విడుదలైంది.

 

సన్ ఆఫ్ ఇండియా
7

లెక్షన్ కింగ్ హీరోగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ అస్సలు రాలేదు.

ఆడవాళ్లు మీకు జోహార్లు
8

ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చ్ 4న విడుదలైంది.  బయ్యర్స్‌కు రూ. 8 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చి మార్చి నెలలో  తొలి ఫ్లాప్‌గా నిలిచింది.

 

రాధే శ్యామ్
9

రాధే శ్యామ్  మార్చ్ 11న విడుదలైంది. ఓవరాల్‌గా ఈ సినిమా  రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

స్టాండ‌ప్ రాహుల్‌
10

స్టాండప్ రాహుల్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మందికి తెలియదు.

 

గ‌ని
11

ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది.  రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 

 

ఆచార్య
12

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..   

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+