బుర్రకథ సినిమా యాక్షన్, కామిడి, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది సాయికుమార్, మిస్తి చక్రబొర్తి, నైరా షా, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, అభిమన్యు సింగ్, జబర్దస్థ్ మహేష్, ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, గాయత్రి గుప్త, జోష్ రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి డైమాండ్ రత్న బాబు దర్శకత్వం వహించారు మరియు నిర్మాత ఎచ్ కె శ్రీనాథ్ దీపాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించారు.
స్టోరీ
ప్రపచంలో ఒక మనిషి.. రెండు మెదళ్లతో జన్మించడం అరుదుగా జరుగుతుంది. అలా పుట్టిన వ్యక్తే అభిరామ్ (ఆది) రెండు మెదళ్లతో పుడతాడు. అతను పెరిగే క్రమంలో అతని శరీరంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలుస్తుంది. అలా ‘అభిరామ్’ కాస్త అభి.. రామ్‌గా చివరికి ఇద్దరు వ్యక్తులుగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు. అభి ఆలోచనలకి, రామ్ ఆలోచనలకు ఏమాత్రం సింక్ లేకపోవడంతో.. ఒకరి వల్ల మరొకరి లైఫ్ రిస్క్ లో పడుతూ ఉంటుంది. అలా సాగుతున్న వారి జీవితంలో రామ్ అనూహ్యమైన నిర్ణయానికి వస్తాడు. కరెక్ట్ గా అదే టైమ్ లో అభి.. హ్యాపీ అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. అభి లవ్ స్టోరీకి విలన్ గా మారతాడు రామ్. అభి ప్రేమకు రామ్ వల్ల వచ్చిన సమస్యలేంటి..? ఆ సమస్యలనుంచి బయటపడి అభి తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు అన్నదే స్టోరీ.