చిన్నారి స్టోరి

  చిన్నారి సినిమా కన్నడలో విడుదలైన 'మమ్మీ' చిత్రాన్ని తెలుగులో 'చిన్నారి' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో ప్రియాంక ఉపేంద్ర, బేబి యువీన పార్థవి, ఐశ్వర్య, మధుసూధన్, మంజునాథ్ హెగ్దే ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లోహిత్ హెచ్ నిర్వహించారు మరియు లక్ష్మి వెంకటేశ్వర మూవీస్ పతాకంపై కె రవికుమార్, ఎమ్ మహేశ్వర్ రెడ్డి అందించారు. ఈ చిత్రానినికి సంగీతం అజినీష్ లోక్ నాథ్  స్వరాలు సమకుర్చరు.

  కథ

  అన్ని దెయ్యం సినిమాల్లో లాగానే... జనసంచారం ఏ మాత్రం లేని ఓ తీర ప్రాంతం(గోవా)లో.. కొండల మధ్యన ఓ విలాసవంతమైన విల్లా. తన భర్త చివరి కోరిక మేరకు ఆ విల్లాలో నివాసం ఉండడానికి తన నాలుగేళ్ల కూతురు క్రియ (యువీన)తో అక్కడికి వస్తుంది ప్రియ (ప్రియాంక). అలాగే దెయ్యం సినిమాలకు ఆలవాలమైన పెద్దగా లంకంత ఇంట్లో నలుగురే ఉంటూంటారు. నాలుగేళ్ల పిల్ల క్రియకు ఆడుకొనేందుకు అక్కడ ఎవరూ ఉండరు. దాంతో ఆ ఇంట్లోని స్టోర్‌ రూమ్‌లో ఉన్న ఓ బొమ్మతో స్నేహం చేస్తుంటుంది క్రియ. స్టోర్‌ రూమ్‌ నుంచి ఆ బొమ్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఆ ఇంట్లో వింత వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. క్రియ కూడా.. బొమ్మని బొమ్మలా చూడదు. ఓ స్నేహితురాలిగా భావిస్తుంటుంది. ‘అమ్మ నేను దెయ్యాన్ని చూశాను' అని తల్లితో చెబుతుంటుంది. ఆ బొమ్మలో ఓ ఆత్మ ఉంది. అది క్రియతో స్నేహం చేస్తూ.. ఇంట్లో వాళ్లని ఓ ఆట ఆడించేస్తుంటుంది. మరి ఆ ఆత్మ ఎవరిది? క్రియతోనే ఎందుకు స్నేహం చేస్తోంది? అనే విషయాల్ని తెరపై చూడాల్సిందే. ఇప్పటికే మీకు ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా.
  **Note:Hey! Would you like to share the story of the movie చిన్నారి with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X