ఇప్పుడు బాడీ ఫిజిక్ వున్న హీరోయిన్స్ కి క్రేజ్ మాములగా లేదు. ఫిట్ నేస్ సెంటర్స్ లో కసరత్తు చేసే అందమైన భామలు చాలా మంది వున్నారు. ఇదివరకు సినిమాల్లో హీరోలతో పోటీపడి ఫైట్స్ చేయడానికి హీరోయిన్లు చాలా కష్టపడే వాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. హీరోలకు తామేం తక్కువ కాదంటూ రంగంలోకి దూకుతున్నారు. ఫిట్ నెస్ మంత్రం జపిస్తున్నారు టాలీవుడ్ హీరోయిన్లు. అసలే హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పిజిక్ విషయంలో కొంచెం తేడా వచ్చినా.. హీరోయిన్ గా అన్ ఫిట్ అనే ముద్ర పడిపోతుంది. అందుకే నోరు కట్టుకుని.. తిండి త్యాగం చేసుకుంటూ.. జిమ్ముల్లోనే ఎక్కవ టైమ్ స్పెండ్ చేస్తున్నారు హీరోయిన్లు. ఫిట్ నెస్ ను కాపాడకుంటున్నారు. మరి సూపర్ ఫిట్ గా మెయింటేన్ చేస్తున్న టాప్ 10 టాలీవుడ్ హీరోయిన్లు.