X
దర్జా
Action | Drama | 22 Jul 2022 | U/A | 130 Mins
Telugu

దర్జా స్టోరీ

దర్జా మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనసూయా భరద్వాజ్, సునీల్, అక్స ఖాన్, రవి పైడిపాటి, షకలక శంకర్, షఫీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సలీం మాలిక్ వహించారు. శివ శంకర్ పైడిపాటి నిర్మించారు. సంగీతం రాప్ రాక్ షకీల్ అందించారు. 

కథ

బందరు ప్రాంతంలో సారా, అక్రమ వ్యాపారాలను మాఫియా రాణి కనకం అలియాస్ కనక మహాలక్ష్మి (అనసూయ భరద్వాజ్) నిర్వహిస్తుంటుంది. కనకం అక్రమాలను, అన్యాయాలను ఎదురించడానికి ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్లను, సామాన్య ప్రజలను మట్టుపెడుతుంటుంది. ఆమెకు తోడుగా తన సోదరుడు బళ్లారి (సమీర్) అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ క్రమంలో పుష్ప అనే అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కనకం, బళ్లారి ప్లాన్ చేస్తాడు. కానీ అప్పటికే రంగ అనే మరో అబ్బాయికి పుష్ప మనసు ఇచ్చేస్తుంది. అనూహ్య పరిస్థితుల్లో రంగ హత్యకు గురవుతాడు? ఇలాంటి పరిస్థితుల్లో నిఖార్సైన పోలీస్ ఆఫీసర్ శంకర్ (సునీల్) రంగంలోకి దిగుతాడు. కనకం ఆగడాలను ఎదురించే పోలీస్ ఆఫీసర్‌ రవి (రవి పైడిపాటి) ఎలా బలయ్యాడు? రంగాను ఎవరు చంపారు? కథలో ఇన్స్‌పెక్టర్ రవికి పోలీసు ఆఫీసర్‌కు లింకేమిటి? ఏ లక్ష్యంతో శంకర్ బందరు ప్రాంతానికి పోస్టింగ్ అవుతాడు? కనకం ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా? బళ్లారి ఆగడాలకు ఎవరు ముగింపు పలికారు? మాఫియా రాణి కనకం అక్రమ వ్యాపారాలకు దర్జాగా ముగింపు పలికిందా? కనకం పాత్రకు ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దర్జా సినిమా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+