దేవదాస్ (2018)(U/A)
దేవదాస్ స్టోరి
దేవదాస్ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున అక్కినేని, నాని, రష్మిక మండన్న, అకాంక్ష సింగ్, ప్రభాకర్, నరేష్, శ్రీనివాస అవసరాల, శరత్ కుమార్, వెన్నెల కిశోర్, నవీన్ చంద్ర, జబర్ధస్థ్ మహేష్, రావు రమేష్, నరేష్ కునల్ కపూర్తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీరామ్ అదిత్య వహిస్తున్నారు మరియు నిర్మాత అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.
కథ
దేవా (మాఫియా డాన్) ఎవరూ లేని అనాధ. తన ఎవరో అనే విషయం ప్రపంచానికి తెలియకుండా మరో మాఫియా డాన్, పెంపుడు తండ్రి (శరత్ కుమార్) నీడలో పెరిగి పెద్దవుతాడు. మాఫియా అంతర్గత కలహాల కారణంగా సేఠ్ (కునాల్ కపూర్) చేతిలో పెంపుడు తండ్రి హత్యకు గురవుతాడు. వారిపై పగ తీర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చిన దేవా ఎన్కౌంటర్లో గాయపడి దాసు ( నాని) వద్దకు చేరుతాడు. అప్పటికే డాక్టర్‌గా రాణించడానికి కష్టాలు పడుతూ క్లినిక్ పెట్టుకొంటున్న దాసుకు దేవా రాకతో కష్టాలు మొదలైతాయి. దేవాతో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది ఈ మూల కథ.