దేవరాయ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీకాంత్, మీనాక్షి దీక్షిత్, విదిశ, బాలయ్య, రంగనాథ్, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, జీవా, శివాజీరాజా తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాని క్రిష్ణ నిర్వహించారు మరియు నిర్మాతలు: నాని కృష్ణ, కిరణ్ జక్కంశెట్టి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
విజయనగర ప్రభువైన శ్రీకృష్ణ దేవరాయలు(శ్రీకాంత్) తన ఆస్తాన నర్తకి(మీనాక్షి దీక్షిత్)పై మోజు పడి ఆమె కోసం ఏదైనా చేయాలనే ప్రయత్నంలో అనుకోకుండా త్రిపురసుందరి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడు. విగ్రహ ప్రతిష్టాపన జరుగక పోతే విజయనగర సామ్రాజ్యం నాశనం అయ్యే ప్రమాదం ఉండటంతో రాయలు ఆత్మార్పణ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేద్దామనే ప్రయత్నం....శత్రువుల దాడి కారణంగా విఫలం అవుతుంది. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం అంతం అవ్వడం జరిగిపోతుంది. కొన్ని శతాబ్దాల తర్వాత రాయల ఆత్మ అమలాపురంలో అల్లరి చిల్లరగా తిరగే దొరబాబు(శ్రీకాంత్)ను ఆవహిస్తుంది. మరి ఎప్పుడో శతాబ్దాల క్రితం నాటి రాయల వారికి, అల్లరి చిల్లరగా తిరిగే దొరబాబుకి సంబంధం ఏమిటి అనేది తర్వాత కథ.