గరం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, ఆదహ్ శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, భరణి, నాజర్, తాగుబోతు రమేష్, కబీర్ సింగ్, శకలక శంకర్, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మదన్ నిర్వహించారు మరియు నిర్మాత రాజ్ కుమార్ యమ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అగస్త్య స్వరాలు సమకుర్చురు.
కథ
వరాల బాబు(ఆది) కు చిన్నప్పటి నుంచీ ప్రక్కింటి కుర్రాడు (చైతన్య కృష్ణ)తో అన్ని విషయాల్లో పోటీనే..ఫెయిల్యూరే. దాంతో అన్నిటిలోనూ ఆ కుర్రాడే గెలిచి, పైనల్ గా ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లిపోతాడు. దాంతో ఇంట్లో ప్రెజర్ ఎక్కవైపోయిన మన వరాలు బాబు కూడా నేను సాధిస్తా అంటూ సిటీకి సిటీ బస్ ఎక్కేస్తాడు. వెళ్లగానే ఖాళీగా ఉండటం ఎందుకని అక్కడ సమీర(ఆద శర్మ)తో ప్రేమలో పడతాడు. అఫ్ కోర్స్ ఫైల్ పట్టుకుని (ఈ రోజుల్లో ఫైల్ ఏంటని అడగొద్దు) ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటాడు. మరో ప్రక్క విలన్ సత్యప్రకాష్ టీమ్..వినాయిక్ సినిమాల్లో లాగ...ఓ ఫొటో పట్టుకుని ఎంక్వైరీ చేస్తూంటుంది. ఈ లోగా.. సమీర కి అక్కడ లోకల్ విలన్ బిజ్జు(కబీర్ దుహన్ సింగ్) నుంచి సమస్య వస్తుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటీ... విలన్స్ కు ఆ ఫొటోలో మనిషి దొరికాడా..ఇంతకీ ఆ మనిషి ఎవరు...విలన్స్ కు హీరోకు లింక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.