గార్గి సినిమా ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం గౌతమ్ రామచంద్రన్ వహించారు. ఈ సినిమాను రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్యా లక్ష్మి, థామస్ జార్జ్, గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. 96 మూవీ ఫేం గోవింద్ వసంత ఈ సినిమాకు సంగీతం అందించారు.
కథ
గార్గి (సాయి పల్లవి) ఒక స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉంటుంది సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసే తండ్రి బ్రహ్మానందం(ఆర్ఎస్ శివాజీ) ఇంట్లో దోశ పిండి వేసి అమ్ముతూ ఉండే తల్లి, స్కూలుకు వెళ్లి చదువుకునే చిన్న చెల్లితో కలిసి జీవిస్తూ ఉంటుంది. తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఇంట్లోనే ట్యూషన్స్ కూడా చెబుతూ ఉంటుంది. అయితే తండ్రి బ్రహ్మానందం పనిచేస్తున్న అపార్ట్మెంట్లో ఒక తొమ్మిదేళ్ల బాలిక మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. ఆ గ్యాంగ్ రేప్ కేసులో గార్గి తండ్రి బ్రహ్మానందాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే తన తండ్రి అలాంటి తప్పు చేయడు అని నమ్మిన గార్గి తన తండ్రిని బయటికి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో తనకు బాగా కావాల్సిన ఒక లాయర్ దగ్గర జూనియర్గా పనిచేస్తున్న గిరీశం(ఖాళీ వెంకట్)తో కలిసి తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ క్రమంలో ఒక రేపిస్ట్ కుమార్తెగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? తన తండ్రిని గార్గి కాపాడుకోగలిగిందా? చివరికి ఈ కేసులో ఎవరు గెలిచారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.