X
Home టాప్ లిస్టింగ్

2023 జనవరి లో విడుదల కానున్న సినిమాలు

Author Administrator | Updated: Monday, January 9, 2023, 07:17 PM [IST]

ఈ జనవరి లో వరుసగా భారీ యాక్షన్ చిత్రాలు పెద్ద తెరపైకి రానున్నాయి. ఇటు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. అటు తమిళంలో దళపతి విజయ్, అజిత్ సినిమాలు బరిలో వున్నాయి


cover image
వీర సింహా రెడ్డి
1

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహా రెడ్డి 12 జనవరి 2023న విడుదల కానుంది. 

వీర సింహా రెడ్డి మూవీ యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోస్, లాల్, చంద్రిక రవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు. 

తెగింపు
2

అజిత్ కుమార్ తెగింపు మూవీ సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానుంది
 
తమిళ సినిమా ‘తునివు’. దీన్ని ‘తెగింపు’ అనే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసారు. బ్యాంక్ దోపిడి చేసే ముఠాకు లీడర్‌గా అజిత్ తెగింపులో కనిపించనున్నారు. యాక్షన్ సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవల్ అన్నట్లు కనిపిస్తున్నాయి చెప్పాలి. అజిత్‌తో ‘వలిమై’ తీసిన హెచ్.వినోద్‌నే ఈ సినిమాకు కూడా...

వాల్తేరు వీరయ్య
3

వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతి బరిలో జనవరి 13న అత్యంత భారీగా విడుదల కానుంది. 

వాల్తేరు వీరయ్య సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, శృతి హాసన్, రవి తేజ, బాబీ సింహ, కేథరిన్‌ త్రెసా, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవీంద్ర వహించారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 

వారసుడు
4

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో విజయ్, రష్మిక తదితరులు నటించిన వారసుడు మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల కానుంది 

వారసుడు సినిమా యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, రష్మిక, మెహ్రీన్, ప్రకాష్ రాజ్, షామ్, ప్రభు, యోగి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి వహించారు. నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంగీతం థమన్ ఎస్ అందించారు. 

కళ్యాణ వైభోగమే
5

సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ కళ్యాణం కమనీయం మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదల కానుంది 

కళ్యాణం కమనీయం సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్, దేవి ప్రసాద్, పవిత్ర లోకేష్, సత్యం రాజేష్, సప్తగిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ కుమార్ అల్లా వహించారు. సంగీతం శ్రవణ్ భరద్వాజ్ అందించారు. 

పఠాన్
6

పఠాన్ మూవీని 2023 జనవరి 25న విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నారు. హిందీ, తమిళం, తెలుగులో మాత్రమే రిలీజ్‌ చేస్తున్నారు. 

బుట్టబొమ్మ
7

బుట్టబొమ్మ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ నటించారు . ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+