గోపాల గోపాల సినిమా రోమ్యంటిక్ కామిడి వినోదాత్మక సినిమా ఇందులో పవన్ కళ్యణ్, వెంకటేష్, శ్రియ, మిథున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్, రాళ్ళపల్లి, వెన్నేల కిశోర్, పృధ్వీ, దీక్షాపంత్, నర్రా శ్రీను, రమేష్ గోపి, అంజు తదితరులు ముక్య పాత్రలలో నటించారు. ఈ సినిమా కు దర్సకత్వం కిశోర్ పార్థసాని(డాలీ) నిర్వహించారు మరియు నిర్మాతలు: డి.సురేష్‌బాబు, శరత్ మరార్ కలిసి నిర్మించారు. సంగీత దర్సకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకూర్చారు.
కథ
దేవుడంటే నమ్మకం లేని నాస్తికుడైన గోపాల రావు(వెంకటేష్) ... దేముడి బొమ్మల దుకాణం నడుపుతుంటాడు. మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలిపోతుంది. ఇన్సూరెన్స్ కోసం వెళితే యాక్ట్ ఆఫ్ గాడ్ (ప్రకృతి వైపరిత్యాల) క్రింద దాన్ని పరిగణించి, అది దేముడి తప్పిందం చెప్తూ పైసా కూడా ఇవ్వలేమని కంపెనీ వారు చెప్తారు. ఈ నేపధ్యంలో ఏమీ చేయలేని పరిస్ధితుల్లో గోపాల రావు ఆ గాడ్(దేముడి) తన నష్టానికి బాధ్యుడు కాబట్టి ఆయన మీదే కేసు వేస్తాడు. దేముడుకి వ్యతిరేకంగా వాదించటానికి ఏ లాయిరూ ముందుకు రాకపోయేసరికి గోపాలరావు స్వయంగా తానే వాదించుకోవటం మొదలెడతాడు. దేముడు ప్రతినిధులుగా చెప్పబడే స్వామీజీలను, మఠాథిపతులను, బాబాలను కోర్టుకు లాగుతాడు.
దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. దాంతో గోపాల రావుకు వ్యతిరేకంగా నిరసనలు చుట్టముడతాయి. దేముడుకు వ్యతిరేకంగా వెళ్లతావా అంటూ అతని బార్య(శ్రియ) అతన్ని వదిలేసి వెళ్లిపోతుంది...అంతా అతన్ని ఒంటిరివాడిని చేస్తారు. మరో ప్రక్క తాము కోర్టుకు లాగబడటంతో అందులో దొంగ స్వామీజిలకు కోపం వచ్చి(పోసాని, మిధున్ చక్రవర్తి) భౌతిక దాడులతో అతన్ని అడ్డు తప్పించాలనుకుంటారు. అప్పుడు భగవంతుడు గోపాలుడే(పవన్ కళ్యాణ్) రంగంలోకి దిగి గోపాలరావుని ఆ సమస్యల నుంచి ఒడ్డెంక్కించే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఏ విధంగా ఆ గోపాలుడు...ఈ గోపాలరావుని ఆదుకున్నాడు అనేది మిగతా కథ.