X
Home టాప్ లిస్టింగ్

తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్నకన్నడ భామలు వీరే..!

Author Administrator | Published: Thursday, April 21, 2022, 02:38 PM [IST]

తెలుగు సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ & శాండల్ వుడ్ నుండి వచ్చిన చాలా మంది నటీమణులు మన తెలుగు పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారు. తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్నకన్నడ భామలు గురించి తెలుసుకుందాం.


cover image
రష్మిక మందన్న
1

రష్మిక తెలుగులోకి రాకముందు  కన్నడలో దర్శన్, పునీత్ రాజ్ కుమార్, గణేష్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించింది..  కన్నడ లో సినిమాలు చేస్తూనే తెలుగు తెర పైకి ఛలో సినిమా ద్వారా పరిచయం అయ్యింది..సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ సినిమాలో మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేసింది.. ఇక రెండోది పుష్ప ది రైజ్. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాలను అందుకోగా రష్మిక క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. ఇవే కాకా దేవదాస్, గీత గోవిందం, డియర్ కామ్రేడ్,ఆడవాళ్లు మీకు జోహార్లు వంటి చిత్రాల్లోనూ రష్మిక నటించింది..

 

పూజా హెగ్డే
2

పూజ హెగ్డే తల్లి తండ్రులు ఉడిపికి చెందిన వారు. తెలుగులో “ఒక లైలా కోసం” అనే చిత్రం ద్వారా పూజ హెగ్డే తెర కు పరిచయం అయ్యింది. తెలుగులో ముకుంద, డీజే, అరవింద సమేత వీర రాఘవ , గద్దలకొండ గణేష్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, మహర్షి, రాధే శ్యామ్ వంటి సినిమాలు చేసింది. 

నభా నటెష్
3

నభా నటేష్ కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన వజ్రకాయ సినిమా తో తెరకు పరిచయం. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా నభా నటేష్ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అదుగో, డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించింది.

ప్రేమ
4

ప్రేమ ఈ నటి పేరు వినగానే అందరికి కోడి రామకృష్ణ తీసిన ‘దేవి‘ సినిమా గుర్తుకు వస్తుంది.. ధర్మచక్రం అనే సినిమాతో ప్రేమ తెలుగు తెర కు పరిచయం అయ్యింది. దేవి సినిమాతో మంచి గుర్తింపు సాధించింది..

హరిప్రియ
5

కన్నడలో ప్రముఖ హీరోలతో కలిసి నటించింది. తకిట తకిట అనే తెలుగు సినిమా ద్వారా హరి ప్రియ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత పిల్ల జమిందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, జై సింహ వంటి చిత్రాల్లో నటించింది..

శ్రీ లీల
6

శ్రీలీల కన్నడ కు చెందిన నటి . మొన్నటి వరకు ఈమె గురించి అస్సలు తెలియని మనకు తెలుగులో ను వచ్చిన పెళ్లి సందడి చిత్రం తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ని ఆకర్షించింది.. రెండు భాషలలోను ఆమె సినిమా కెరీర్ ముందుకు సాగాలని కోరుకుందాం.

శ్రద్దా శ్రీనాథ్
7

శ్రద్దా శ్రీనాథ్ గురించి చెప్పాలంటే మన తెలుగు లో మూడే మూడు సినిమాలే చేసింది.. జెర్సీ, జోడి, శ్రీకృష్ణ అండ్ లీల. ఇందులో జెర్సీ సినిమాలో హీరో నాని తో పాటు హీరోయిన్ గా శ్రద్దా శ్రీనాథ్ అద్భుతంగా నటించింది..

ప్రణీత సుభాష్
8

అత్తారింటికి దారేది మరియు పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాలు ప్రణీత కు మంచి పేరును తీసుకొచ్చాయి.. బెంగుళూర్ లో పుట్టిన ప్రణీత అక్కడి ప్రముఖుల హీరోల పక్కన నటించి ఒక దశలో కన్నడ లో అగ్ర కథానాయికగా పేరు సంపాదించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+