హోరా హోరీ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దిలీప్, దక్ష తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం తేజ నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కళ్యాని మాలిక్ స్వరాలు సమకుర్చారు
కథ
మైధిలి (దక్ష) అన్న ఏసిపీ మరియు తండ్రి సీఐ గా పనిచేస్తుంటారు..ఇద్దరు లంచగోండులే. నడిరోడ్డుమీదే బసవ (చస్వా) ఒక ఫ్యామిలీని చంపేస్తాడు.. ఆ హత్యల తాలూకు సాక్ష్యాలను కొట్టయడానికి మైథిలి తండ్రీ, అన్న కలిసి పాతిక లక్షలు అడుగుతారు. మైథిలి పెళ్లిలో ఆ మొత్తాన్ని తెచ్చిస్తాడు బసవ. అక్కడ మైథిలి నచ్చడంతో పెళ్లికొడుకును చంపిస్తాడు...దీంతో మైథిలి డిప్రషన్‌కు వెళ్తుంది. దాంతో మైధిలి డాక్టర్ సలహామేరకు అక్కడ నుంచి ప్రశాంతంగా ఉండే చోటికి తీసుకెళ్తారు. అక్కడ ఆమెకు స్కంథ (దిలీప్) పరిచయమవుతాడు...స్కంథ పరిచయం వల్ల మైధిలి త్వరగా కోలుకుంటుంది. మైధిలి గతం గురించి స్కంథ కు తెలుస్తుంది. అప్పుడు సమాజంలో జరుతుతున్న అవినీతిని అలాగే రౌడి దౌర్జన్యలపై ఎలా స్పందిస్తాడు..అలాగే మైధిలిని స్కంథ ప్రేమిస్తాడా....లేదా అనేది మిగతా కథ.