హైదరాబాద్ లవ్ స్టోరి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాహుల్ రవింద్రన్, రేష్మిమీనన్, జియా హీరో హీరోయిన్లుగా మరియు రమాప్రభ, సన, సూర్య, షఫి, తాగుబోతు రమేష్ రావు రమేశ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా దర్శకత్వం రాజ్ సత్య జి యమ్ నిర్వహించారు, నిరాత ఎస్ ఎన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ స్వరాలు సమకుర్చారు.
కథ
భాగీ అలియాస్ భాగ్యలక్ష్మి (రేష్మీ మీనన్) చలాకైన యువతి. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లో కార్తీక్ (రాహుల్ రవీంద్రన్) ఇంజినీర్‌గా పని చేస్తుంటాడు. తొలిచూపులోనే కార్తీక్, భాగీ ప్రేమలో పడుతారు. భాగీతో ప్రేమలో పడటానికి ముందే కార్తీక్‌కు వైష్ణవి (జియా) అనే యువతితో బ్రేకప్ అవుతుంది. కార్తీక్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిన భాగీకి వైష్ణవి ఓ భయంకరమైన విషయాన్ని చెబుతుంది. దాంతో కార్తీక్, భాగీకి మధ్య మనస్పర్ధలు వస్తాయి. కార్తీక్ గురించి భాగీకి వైష్ణవి చెప్పిన భయంకరమైన విషయం ఏమిటి? కార్తీక్, వైష్ణవి మధ్య అఫైర్ ఎందుకు బ్రేకప్ అయింది? కార్తీక్, వైష్ణవి మళ్లీ కలుసుకొన్నారా? కార్తీక్, భాగీ ప్రేమకు ముగింపు ఏమిటీ? కార్తీక్ జీవితంలో అలీ అనే యువకుడి పాత్ర ఏమిటీ? కథలో రావు రమేష్ ఏ విధంగా కీలకంగా మారాడు అనే ప్రశ్నలకు తెరమీద సమాధానమే హైదరాబాద్ లవ్ స్టోరీ.