టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించి.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్. వీడు హీరో ఎంట్రా అనే స్థాయి నుంచి వీడు రా హీరో అనే స్థాయికి ఎదిగిన నటుడు అల్లుఅర్జున్. మెగా ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తన నటన, అభినయం, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పుచుకుని ఐకాన్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలోకి తనకంటూ ఓ ఐడెంటీటి క్రియేట్ చేసుకున్నాడు. బన్నీ, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ ఇలా ఏ పేరుతో పిలిచినా అన్నీ అతనే. స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్ సినీ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం