జంప్ జిలాని సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్ ,కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు దితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై నిర్మాత : అంబికా రాజా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఎబెంజర్ స్వరాలు సమకుర్చారు.
కథ
నిడదవోలు లో తమ తాతల నుంచి వస్తున్న హోటల్ బిజినెస్ లో నష్టబోయి అప్పులుపాలై ఉంటాడు సత్తిబాబు(అల్లరి నరేష్). హోటల్ నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో ఉన్న అతని దగ్గరకు తమ్ముడు రాంబాబు(మరో నరేష్) వస్తాడు. రాంబాబు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రాంబాబు ఓ దొంగ...జల్సా రాయుడు..పేకాట పిచ్చోడు. అయితే అన్నగారి కష్టం చూసి ఆ హోటల్ ని తన తాత(కోట)సలహాలతో డవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా ఆ హోటల్ పై ఆ ఊరి పెద్దమనిషి(బెనర్జి)కన్ను పడుతుంది.
మరో ప్రక్క ఆ ఊరుకి వచ్చిన ఫుడ్ ఇన్సపెక్టర్(ఇషా ఛావ్లా)తో ప్రేమలో పడతాడు సత్తిబాబు. అయితే ఆమెకో ఫ్యాక్షన్ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. పులివెందులలో ఉండే ఆమె బావ ఫ్యాక్షనిస్టు(పోసాని)ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమస్యలనుంచి తమ్ముడు సాయింతో తన లవర్ ని ,హోటల్ ని ఎలా రక్షించుకున్నాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో రామాయణంలో పిడకల వేటలా రావు రమేష్ వజ్రాల వేట జరుగుతూంటుంది. అది ఏమిటి...కథ కి దానికి సంభంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే