X
తెలుగు » సినిమాలు » జంప్ జిలాని
జంప్ జిలాని

జంప్ జిలాని

Comedy | Romance | 12 Jun 2014 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

జంప్ జిలాని స్టోరీ

జంప్ జిలాని సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ ,కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు దితరులు ఇతర ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై నిర్మాత : అంబికా రాజా నిర్మించారు. ఈచిత్రానికి సంగీతదర్శకుడు విజయ్‌ ఎబెంజర్‌ స్వరాలు సమకుర్చారు. కథ  నిడదవోలు లో తమ తాతల నుంచి వస్తున్న హోటల్ బిజినెస్ లో నష్టబోయి అప్పులుపాలై ఉంటాడు సత్తిబాబు(అల్లరి నరేష్). హోటల్ నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో ఉన్న అతని దగ్గరకు తమ్ముడు రాంబాబు(మరో నరేష్) వస్తాడు. రాంబాబు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రాంబాబు ఓ దొంగ...జల్సా రాయుడు..పేకాట పిచ్చోడు. అయితే అన్నగారి కష్టం చూసి ఆ హోటల్ ని తన తాత(కోట)సలహాలతో డవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా ఆ హోటల్ పై ఆ ఊరి పెద్దమనిషి(బెనర్జి)కన్ను పడుతుంది.  మరో ప్రక్క ఆ ఊరుకి వచ్చిన ఫుడ్ ఇన్సపెక్టర్(ఇషా ఛావ్లా)తో ప్రేమలో పడతాడు సత్తిబాబు. అయితే ఆమెకో ఫ్యాక్షన్ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. పులివెందులలో ఉండే ఆమె బావ ఫ్యాక్షనిస్టు(పోసాని)ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమస్యలనుంచి తమ్ముడు సాయింతో తన లవర్ ని ,హోటల్ ని ఎలా రక్షించుకున్నాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో రామాయణంలో పిడకల వేటలా రావు రమేష్ వజ్రాల వేట జరుగుతూంటుంది. అది ఏమిటి...కథ కి దానికి సంభంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే
Read More

జంప్ జిలాని కాస్ట్ & క్రూ

జంప్ జిలాని సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇ సత్తిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం విజయ్‌ ఎబెంజర్‌
నిర్మాత అంబికా రాజా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జంప్ జిలాని విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వాస్తవానికి కలగప్పు తమిళంలో హిట్టే కానీ, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినంత కథా రాజం కాదు అది. సోల్ కిచెన్ అనే సినిమా ప్రేరణతో తయారైన ఆ చిత్రం దర్శకుడు సుందర్ . సి చేసిన కామెడీ మాయాజాలంతో మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేయటం కష్టం అన్నట్లు సీన్స్ ఉంటాయి. దానిని తెలుగుకి అనువదించాలనుకున్నప్పుడు కథలో ఆత్మని సరిగ్గా పట్టుకోవాల్సింది. హోటల్ ని డవలప్ చేసే ప్రాసెస్ లో కథ ఎత్తుగడ మొదలై తర్వాత అది ఫ్యాక్షన్ సెటప్ లోకి వెళ్లిపోగానే సినిమా డల్ అవటం మొదలెట్టింది. అన్నదమ్ములు ఇద్దరూ ఆ హోటల్ ని అభివృద్ది చేసేటప్పుడు ఏ సమస్యలు వచ్చాయి..వాటినుంచి ఎలా బయిట పడ్డారనే విధంగా కథ అల్లు కుంటే బాగుండేది. దానికి తోడు సబ్ ప్లాట్ లను మెయిన్ ప్లాట్ లుగా భావించి,ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం కూడా సినిమాను విసుగొచ్చేలా చేసింది.

జంప్ జిలాని సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జంప్ జిలాని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+