ఖలేజా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, అనూష్క, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ నిర్వహించారు మరియు నిర్మాతలు: శింగనమల రమేశ్ బాబు, సి. కల్యాణ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
సీతారామరాజు(మహేష్) ఉషారైన క్యాబ్ డ్రైవర్. జర్నీలో అనుకోకుండా పరిచయమైన సుభాషిణి (అనూష్క) తో ప్రేమలో పడతాడు. ఐరెన్ లెగ్ లాంటి ఆమె కలిసినప్పుడల్లా దురదృష్టం వెంటపడుతున్నా ఎడ్జెస్ట్ అవుతూంటాడు. అలా లైఫ్ ని, క్యాబ్ ని ఈజీగా నడిపేస్తూ గడిపేస్తున్న రాజు...ఓ రోజు...రాజస్ధాన్ పల్లెలో ఉన్న ఓ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ చెక్ అందించటానికి వెళ్ళాల్సివస్తుంది. అయితే ఇక్కడో ట్విస్టు. రాజస్ధాన్ లోని ఆ గ్రామం పరిస్ధితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ జనం కారణం తెలియకుండా వరసగా చనిపోతూంటారు. అయితే వారి మత పెద్ద ...దేముడు వచ్చి తమని రక్షిస్తాడని నమ్మి...కొన్ని లక్షణాలు, గుర్తులుతో దేముడు కోసం వెతికిస్తూంటాడు. ఈ లోగా రాజస్ధాన్ చేరిన రాజు ..అనుకోకుండా వారికి దొరికిపోతాడు. వారు రాజునే దేముడుగా భావించి ఆ గ్రామాన్ని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు రాజు ఎలా రియాక్టవుతాడు...కష్టాల్లో ఉన్న ఆ ఊరిని రక్షిస్తాడా..ఇంతకీ ఆ ఊరికి...బిజెనెస్ టైకూన్ జి.కె(ప్రకాష్ రాజ్) కీ ఉన్న సంభందం ఏమిటీ... అన్న విషయాలు తెరపైనే చూడాలి.