కార్తికేయ 2 సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ, శ్రీనివాస్ రెడ్డి, సత్య అక్కల, ప్రవీణ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు. నిర్మాతలు టి జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందించారు.
కథ
డాక్టర్ కార్తీకేయ కుమారస్వామి కొత్త విషయాలపై పరిశోధన చేసే యువకుడు. వాస్తవాలు, లాజిక్స్ కళ్లకు కనిపిస్తే తప్ప పురాణాలైనా, ఇతిహాసాలైనా నమ్ముని డాక్టర్.. ఓ సందర్భంలో తన తల్లి (తులసి), స్నేహితుడు రవి (సత్య)తో కలిసి పురాతన ఇతిహాస నగరం ద్వారకకు వెళ్తాడు. ద్వారకలో పర్యటిస్తుండగా పురావస్తు పరిశోధకుడి హత్య కేసులో ఇరుక్కుపోతాడు. దేవుళ్లంటే నమ్మని కార్తీకేయ ఎందుకు ద్వారకకు వెళ్లాడు? ద్వారకలో కార్తీకేయకు ఎలాంటి పరిస్థితులు తారసపడ్డాయి? ద్వారక నగరంలో ఎలా హత్య కేసులో ఇరుక్కుపోయారు? ద్వారకలోని అభిరా తెగ కార్తీకేయను ఎందుకు వెంబడించారు? ద్వారకలో ఉండే ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్)తో ఎలాంటి సంబంధం ఏర్పడింది? నిధి నిక్షేపాల వేటను కొనసాగించే డాక్టర్ శంతను (ఆదిత్య మీనన్) కార్తీకేయను ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కథలో ధన్వంతరి (అనుపమ్ ఖేర్) ప్రాధాన్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే కార్తీకేయ 2 చిత్ర కథ.