కిరోసిన్ సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధృవ, ప్రీతి సుందర్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ధృవ వహించారు. నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మించారు. సంగీతం అనంత నారాయణ ఏజీ, తేజా కునూరు అందించారు.
కథ
ఏపీలోని మారుమూల ప్రాంతమైన జనగూడెంలో వరుస హత్యలు ప్రజలను బెంబెలెత్తిస్తాయి. అదే గ్రామానికి చెందిన తండాలోని రామప్ప (సమ్మెట గాంధీ) కూతురు గౌరీ (లావణ్య చెవుల) అత్యాచారానికి గురై హత్యగావింపబడటం సంచలనం రేపుతుంది. అయితే వరుస హత్యల నేపథ్యం వెనుక కూపీ లాగాడానికి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ వైభవ్ (ధృవ)ను రంగంలోకి దించుతారు. మహిళలపై అత్యాచారం, హత్య సంఘటనల దర్యాప్తు చేపట్టిన ఏసీపీ వైభవ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హత్య కేసులను ఎస్సై (జీవిన్) ఎందుకు క్లోజ్ చేశాడు? స్థానిక ఎమ్మెల్యే (బ్రహ్మాజీ) ఈ కేసులో జోక్యం చేసుకొన్నాడు? గౌరీ మరో ఇద్దరి హత్యల వెనుక కారణం ఎవరు? ముగ్గురిని ఎందుకు హత్య చేశారు? ఏపీసీ ధృవ హంతకులకు ఎలాంటి శిక్షను విధించాడు? ఈ సినిమాకు కిరోసిన్ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కిరోసిన్ మూవీ కథ.