X
Home టాప్ లిస్టింగ్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్స్..సినిమాలు

Author Administrator | Updated: Wednesday, April 26, 2023, 01:14 PM [IST]

కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ గురించి అభిమానులే కాదు.. ఇండస్ట్రీ వర్గాలు, మీడియా వర్గాలు, ట్రేడ్‌ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి.క్రేజీ కాంబినేషన్ అంటూ కథనాలు వెలువడిన దగ్గర్నుంచీ -సినిమా ఎప్పుడొస్తుందా? అని ప్రేక్షకుడు ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో భారీ స్టార్లుంటే -ఆ సినిమా రేంజ్ చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి ఆసక్తిరేపే కాంబినేషన్స్ రాబోతున్నాయి. ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడొస్తుందా? అన్న ఆసక్తి ప్రతి సినిమా లవర్‌లోనూ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ కాంబినేషన్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం.


cover image
1

తన ప్రతి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళుతున్న జక్కన్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో ఓ మూవీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాలు.. రాజమౌళి తెరక్కించిన సినిమాలకు అసలు పోలికే ఉండదు. అలాంటిది వీరిద్దరూ చేతులు కలిపారు. రాజమౌళి సినిమాలో మహేష్ రోల్ ఏంటి, ఎలా కనిపించబోతున్నాడు, ఎలాంటి కథ అనే ఆసక్తి ఇప్పటి నుంచే మొదలైపోయింది. 

2

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2 సూపర్ హిట్ అయ్యాయి.  పుష్ప మూవీ క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు.పుష్ప 2 చిత్రం భారీ ఎత్తున పాన్ ఇండియా స్థాయిలో 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు ధీమా తో ఉన్నారు.

3

డైరెక్టర్ శంకర్ దర్శకత్వం గురించి చెప్పేదేముంది. అద్భుతమైన కథకు తన దర్శకత్వ ప్రతిభ జోడించి సినిమాని తారాస్థాయికి చేర్చుతారు. ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని సినిమాటిక్ అనుభూతి అందించడంలో శంకర్ దిట్ట. అలాంటి దర్శకుడితో రాంచరణ్ పనిచేస్తుండడంతోగేమ్‌ ఛేంజర్‌ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. శంకర్ సినిమాల్లో హీరోలకు విభిన్నమైన గెటప్స్ ఉంటాయి. మరి ఈ చిత్రంలో శంకర్ చరణ్ ని ఎలా చూప్పించబోతున్నారు అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

 

4

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి ఆల్రెడీ ప్రకటన వచ్చేసింది. ఈ కాంబినేషన్ ఎంత త్వరగా ప్రారంభం అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ లో యష్ ని ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన విధానం ఊహించుకుంటుంటే.. ఎన్టీఆర్ ని ఇంకెంత పవర్ ఫుల్ గా, మాస్ గా చూపిస్తాడో అని ఆసక్తి పెరిగిపోతోంది. 

5

మహానటి చిత్రంతో అందరిని ఆకర్షించిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ చిత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతోందట. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+