లెజెండ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలాక్రిష్ణ, జగపతి బాబు, రాధిక ఆప్తె, సోనల్ చౌహన్, కళ్యాని, సుమన్, సుహాసిని మణి రత్నం, బ్రహ్మానందం, రావు రమేష్, సితార, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజి, హంస నందిని, చలపతి రావు, ఎల్ బి శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బోయపాటి శ్రీను నిర్వహించారు మరియు నిర్మాతలు అచంట గోపినాథ్, అచంట రాము, అనిల్ సుంకర్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
క్రిష్ణ (బాలక్రిష్ణ) విదేశాలలో పెరిగి.. తను ప్రేమించిన స్నేహ (సోనల్ చౌహన్) పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు..అప్పుడు ఇండియాలో ఉన్న తన నాన్నమ్మ మరియు తన కుటుంబ సమక్షంలో జరుపుకోవాలని ఇక్కడి వస్తాడు. ఇక్కడ వున్న క్రిష్ణ భూముల జీతేంద్ర (జగపతి బాబు) లాక్కోవాలనుకుంటాడు..అప్పుడు ఆగోడవల్లో క్రిష్ణ చనిపోతాడు..ఆతర్వతా తన అన్నా జై దేవ్ (బాలక్రిష్ణ) జీతేంద్ర ను ఏదిరించి తన కుటుంబాన్ని మరియు తమ ఆస్థి ఎలా కాపాడుతాడు అనేది..మిగతా కథా.