లౌక్యం సినిమా యాక్షన్ రొమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ , సంపత్, హంసా నందిని, బ్రహ్మానందం, పృద్వీ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్ నిర్వహించారు, నిర్మాత వి ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రనికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
వరంగల్ లో ఉండే వెంకీ అలియాస్ వెంకటేశ్వరులు(గోపిచంద్) లోకల్ గూండా బాబ్జీ(సంపత్) చెల్లెలుని తన స్నేహితుడు ప్రేమిస్తే కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేస్తాడు. దాంతో అచ్చ తెలుగు విలన్ లాంటి బాబ్జీ...వెంకీని వెతుకుతూంటే...తప్పించుకోవటానికి హైదరాబాద్ వస్తాడు. అక్కడ వెంకీ ఓ రోజు చంద్రకళ(రాకుల్ ప్రీతి సింగ్) తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటూ ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి రకరకాల విన్యాసాలు చేసి మెప్పిస్తాడు....పనిలో పనిగా డ్యూయిట్స్ వేసుకుంటాడు.
అయితే ఇక్కడో ట్విస్ట్ వెంకీ ని పూర్తిగా ఇరుకున పడేస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటీ అంటే చంద్రకళ మరెవరో కాదు... బాబ్జీ రెండో చెల్లెలు. అక్కడ నుంచి వెంకీ లవ్ స్టోరీ ఏ మలుపు తీసుకుంది...చివరకు ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.