X
Home టాప్ లిస్టింగ్

5 బెస్ట్ బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) తెలుగు మూవీస్

Author Administrator | Published: Wednesday, April 12, 2023, 05:28 PM [IST]

బ్లాక్ మ్యాజిక్ చిత్రాల కోసం కళ్లు కాయలు కాసేలా వేచి చూసే అభిమానులు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు.హారర్ చిత్రాల దర్శకులు తమ వినూత్నమైన ఐడియాలతో సన్నివేశాలను తీర్చిదిద్ది ప్రేక్షకులను మరింతగా భయపెడతారు. సినీ ప్రేమికుల్లో హారర్, చేతబడి చిత్రాలను ఇష్టపడే ఓ ప్రత్యేక వర్గం ఉంటుంది. హారర్ చిత్రం వచ్చిందంటే వారికి పండగేనని చెప్పాలి. రాత్రివేళ దుప్పటి కప్పుకుని భయపడుతూ చూసే హారర్ మూవీ లవర్స్ కొందరైతే, నన్నేది భయపెట్టలేదని ధైర్యంగా చూసే వారు మరికొందరు. ఎలా అయితేనేం, హారర్ చిత్రాల పట్ల ఉన్న మక్కువతో భయం ఉన్నా ఏకపోయినా వాటిని ఎంజాయ్ చేయక మానరు. తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన 5 బెస్ట్ బ్లాక్ మ్యాజిక్ సినిమాలు ఇప్పుడు చూద్దాం


cover image
రక్ష
1

2008లో విడుదలైన రక్ష బహుశా తెలుగులో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలలో అత్యంత భయానక చిత్రాలలో ఒకటి. ఇది హిందీ చిత్రం ఫూంక్‌కి రీమేక్, ఇది యెండమూరి వీరేంద్రనాథ్ 1980 నాటి తులసి దళం నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ భయానక చిత్రంలో దెయ్యం ప్రమేయం లేనప్పటికీ, ఇది బ్లాక్ మ్యాజిక్ ఆధారంగా రూపొందించబడింది మరియు దానిని తెరపై చూపించిన విధానం మీ వెన్నులో వణుకు పుట్టించడం ఖాయం.

 

అరుంధతి
2

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమా “అరుంధతి”. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క తన నటనతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారడమే కాక మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాణమిచ్చింది. బ్లాక్ మ్యాజిక్ కి  కొత్త నిర్వచనం ఇచ్చింది.  “వదల బొమ్మాళి” అనే డైలాగ్ అందరికి గుర్తిండి పోయింది. పశుపతి పాత్రలో జీవించినందుకు సోనూ సూద్‌కి మరియు తన నిష్కళంకమైన డబ్బింగ్ నైపుణ్యం ద్వారా పాత్రకు ప్రాణం పోసినందుకు రవిశంకర్‌కి ధన్యవాదాలు. అరుంధతి హారర్ మరియు ఫాంటసీ యొక్క ఖచ్చితమైన మిక్స్ మరియు ఇప్పటి వరకు టాలీవుడ్‌లో రూపొందించబడిన అత్యంత సాంకేతికంగా అద్భుతమైన చిత్రాలలో ఒకటిగా కొనసాగుతోంది.

మసూద
3

సహజంగా ఇంతవరకూ తెలుగులో వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా హిందువుల పక్షానే సాగాయి. మనిషి శరీరంలో ప్రవేశించిన దుష్ఠశక్తిని వదలగొట్టడానికి మంత్రగాళ్ళంతా దేవతలను, అమ్మవార్లనే ఆరాధిస్తూ వచ్చేవారు. ఇది ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన దెయ్యం కథ. ‘మసూద’ అనే మంత్రగత్తె ఓ ముస్లిం కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది,  ఊరు ఊరంతటినీ ఎలా వల్లకాడు చేసింది,  చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆత్మ తిరిగి నజియా అనే యువతిని పట్టుకుని ఎలాంటి అరాచకం సృష్టించాలనుకుంది  అనే అంశాలను చాలా ఆసక్తికరంగా దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఉత్కంఠభరితంగా ఇది సాగిపోయింది. 

 

అమ్మోరు
4

అమ్మోరు 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా.ఇందులో సౌందర్య, రమ్యకృష్ణ, సురేష్, రామిరెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.  హర్రర్, మంత్రాలు, తంత్రాలకు సంబంధించిన మంచి కథలను తీసుకొని ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టారు. 

మా ఊరి పొలిమేర
5

మా ఊరి పొలిమేర 2021లో విడుదలైన తెలుగు సినిమా. ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాని ప్రేక్షకులకు బోరు కొట్టకుండా, ఉత్కంఠతో ఊపేస్తూ అలరిస్తాయి క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌లు‌. ఇక దెయ్యాలు, భూతాలు, చేతబడి, బాణామతి వంటి నేపథ్యాలతో సాగుతుంది . చివరి 30 నిమిషాలు దర్శకుడు ట్విస్ట్‌లతో నింపేశాడు. ఒక్కో చిక్కుముడి విడిపోతుంటే తెరపై కనిపించే పాత్రలే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడూ ఆశ్చర్యపోతాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+