లవ్‌లీ సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది, శాన్వి, రాజేంద్రప్రసాద్, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, చిన్మయి, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, ఆహుతి ప్రసాద్, తాగుబోతు రమేష్, సత్యకృష్ణ, వినయ ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి బి జయ నిర్వహించారు మరియు నిర్మాత బి ఎ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
ఆకాష్(ఆది) ప్రాక్టికల్‌గా అందరితో సరదాగా కలిపోయే యువకుడు. ఆడవారన్నా, ప్రేమన్నా పెద్దగా ఇంట్రస్టు ఉండదు. అతని ఫ్రెండ్ కిట్టు(వెన్నెల కిషోర్) ఫేస్‌బుక్ ద్వారా లల్లి(చిన్మయి) అనే అమ్మాయితో ఆన్ లైన్ స్నేహం చేస్తుంటాడు. ఫోన్లు, చాటింగులే తప్ప ఇద్దరు ఎప్పుడూ చూసుకోరు. ఒక రోజు ఇద్దరూ కలవాలనుకుంటారు. లల్లిపై ప్రేమ పెంచుకున్న కిట్టు ఆమె వద్దంటే తట్టుకునే ధైర్యం లేక....తన బదులు తన స్నేహితుడు ఆకాష్‌ను పంపుతాడు. ఇటు లల్లి కూడా తను వెల్లకుండా తన ఫ్రెండ్ లావణ్య(శాన్వి)ని పంపుతుంది. ఈ క్రమంలో తొలి చూపులోనే ఆకాష్, లావణ్య ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. తమ ఫస్ట్ మీటింగులో ఆకాష్ బిహేవియర్ చూసిన లావణ్య తండ్రి మంగళంపల్లి మహారథి(రాజేంద్రప్రసాద్) అతనిపై అయిష్టాన్ని పెంచుకుంటాడు. అయితే కూతురు అంటే ఎంతో ఇష్టపడే మహారథి.....తనకు ఇష్టం లేకున్నా ఆకాష్‌తో ఆమె ప్రేమకు ఒప్పుకున్నాడా? లేక ఇంకేమైనా చేశాడా? అనేది తెరపై చూడాల్సిందే.